శ్రావణి మర్డర్ కేసు : వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : April 28, 2019 / 08:14 AM IST
శ్రావణి మర్డర్ కేసు : వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టెన్త్ క్లాస్ విద్యార్థిని శ్రావణి మర్డర్ కేసు విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కోణాలు బయటపడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా  బొమ్మలరామారం మండలం హామీపూర్ లో మిస్సింగ్ కేసులు వెలుగుచూశాయి. నాలుగేళ్ల క్రితం కల్పన అనే బాలిక అదృశ్యమైంది. ఆరో తరగతి చదువుతున్న కల్పన కనిపించకుండా పోయింది. దీనిపై పోలీసులకు  ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికీ కల్పన ఆచూకీ లభ్యం కాలేదు. శ్రావణి హత్య కేసు, కల్పన మిస్సింగ్ కేసులతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ రెండు కేసులకు ఏమైనా సంబంధం  ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు.

శ్రావణి కేసుని పోలీసులు ఛాలెంజ్ గా తీసుకున్నారు. అక్కడ బాలికలు వరుసగా ఎందుకు మిస్ అవుతున్నారు? వారిని ఎవరు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అనేది ఆరా తీస్తున్నారు. మోడల్ స్కూల్ పరిసర  ప్రాంతంలో గంజాయికి అడిక్ట్ అయిన యువకులు ఉన్నారని పోలీసుల విచారణలో తేలింది. బొమ్మలరామారం మండలం పరిసరాల్లో విచ్చలవిడిగా గంజాయి సరఫరా జరుగుతోంది. యువకులు గంజాయి  బానిసలయ్యారు. మత్తు పదార్దాలకు బానిసగా మారిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాల క్రితం నాటి కల్పన కేసులో పోలీసులు ఎందుకు  పురోగతి సాధించలేకపోయారు అనేది ఆరాతీస్తున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌ గ్రామానికి చెందిన పాముల నర్సింహా, నాగమణిల కుమార్తె శ్రావణి.. తొమ్మిదో తరగతి పూర్తి చేసింది. పదో తరగతి స్పెషల్‌ క్లాసులు మొదలవడంతో మేడ్చల్‌ జిల్లా కీసర  మండలంలోని సెరినిటి మోడల్‌ స్కూల్‌కు ఎప్పటిలాగే రోజు వెళ్లివస్తోంది. ఇదే క్రమంలో గురువారం (ఏప్రిల్ 25,2019) ఉదయం కూడా స్కూల్‌కని వెళ్లిన శ్రావణి.. ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారు పడిన  అమ్మాయి తల్లిదండ్రులు పాఠశాలలో వాకబు చేశారు. అక్కడి నుంచి వెళ్లిపోయిందని చెప్పడంతో గ్రామంలో చుట్టుపక్కల వెతికారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. ఫలితం  లేకుండా పోయింది.

శ్రావణి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు హాజీపూర్‌ సమీపంలో పాడుబడిన బావి పక్కనే తొలుత బాలిక స్కూల్‌ బ్యాగ్‌ను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో డాగ్‌ స్క్వాడ్, క్లూస్‌ టీం రంగంలోకి దిగాయి. భువనగిరి రూరల్‌ సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్‌ఐ వెంకటేశ్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శుక్రవారం (ఏప్రిల్ 26,2019) ఉదయం స్కూల్‌ బ్యాగు లభించగా.. రాత్రికిగాని శ్రావణి జాడ కనిపెట్టలేకపోయారు. ఆ బావికి సమీపంలోని మరో బావిలో ఆమెను పూడ్చి పెట్టినట్టు రాత్రి సమయంలో గుర్తించారు గ్రామస్థులు. ముందుగా అత్యాచారం చేసి తర్వాత హత్య చేసినట్టు తెలుస్తోంది. శుక్రవారం రాత్రి పదకొండు గంటల సమయంలో గ్రామస్థుల సమక్షంలో పోలీసులు శవాన్ని వెలికితీశారు. శ్రావణిని చంపింది ఎవరు? ఎందుక చంపారు? అనేది మిస్టరీగా మారింది.