Accident : వారం క్రితం పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

డిసెంబర్ 26న పెళ్లి చేసుకున్న శ్రీనునాయక్... తన స్వగ్రామంలో ఒడి బియ్యం కార్యక్రమం ముగించుకుని తండ్రితో కలిసి ఆటోలో హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది.

Accident : వారం క్రితం పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో ఎస్‌ఐ మృతి

Accident

SI killed in a road accident : నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వారం క్రితం పెళ్లి చేసుకున్న ఓ ఎస్‌ఐ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. చింతపల్లి మండలం మాల్ దగ్గర దేవరకొండ డిపో ఆర్టీసీ బస్సు, ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో వికారాబాద్ వన్‌టౌన్ ఎస్ఐ శ్రీను నాయక్, ఆయన తండ్రి మాన్య నాయక్ మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మాన్య తండాకు చెందిన శ్రీను నాయక్.. వికారాబాద్ వన్‌టౌన్ ఎస్‌ఐగా పని చేస్తున్నాడు.

డిసెంబర్ 26న పెళ్లి చేసుకున్న శ్రీనునాయక్… తన స్వగ్రామంలో ఒడి బియ్యం కార్యక్రమం ముగించుకుని తండ్రితో కలిసి ఆటోలో హైదరాబాద్‌ వస్తుండగా ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం మాల్ దగ్గర దేవరకొండ డిపో ఆర్టీసీ బస్సు… ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో శ్రీనునాయక్‌తోపాటు అతడి తండ్రి మాన్యనాయక్ కూడా మృతి చెందాడు. ఇద్దరి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

FCRA License Revoked : మదర్ థెరెస్సా మిషనరీస్ ఆఫ్‌ చారిటీతో సహా 6 వేల ఎన్జీవోలకు FCRA లైసెన్స్ రద్దు

గత నెల 26న తుర్కయాంజాల్ క్రాస్ రోడ్డులోని తొక్కు సత్తిరెడ్డి గార్డెన్‌లో వర్ష అనే యువతితో ఎస్ఐ శ్రీనివాస్ వివాహం జరిగింది. 27న రిసెప్షన్ నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో ఒడిబియ్యం కార్యక్రమం ఉండడంతో తన తండ్రి మాన్యానాయక్‌ను తీసుకొని హైదరాబాద్ నుంచి స్వగ్రామం మాడుగుల మండలం మాన్యానాయక్‌ తండాకు వెళ్లారు. అక్కడ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న అనంతరం తండ్రితో కలిసి హైదరాబాద్‌కు ఆటోలో బయలుదేరారు.

ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. శ్రీను నాయక్, అతని తండ్రి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న చింతపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆర్టీసీ డ్రైవర్‌ పోలీసుల అదుపులో ఉన్నారు.

Omicron Variant : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒమిక్రాన్‌ టెన్షన్.. దుబాయ్‌ నుంచి వచ్చిన పలువురికి వేరియంట్

శ్రీను నాయక్‌ వారం క్రితమే వికారాబాద్ వన్‌టౌన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. అంతలోనే వివాహ ముహూర్తం దగ్గర పడింది. పెళ్లి చేసుకునేందుకు ఎస్‌ఐ సెలవులపై ఉన్నారు. ఛార్జ్ తీసుకున్న రెండు రోజులకే ఆయన వివాహం జరిగింది.