Maharashtra Road Accident : ఘోర ప్రమాదం, ఆరుగురు దుర్మరణం.. వివాహ వేడుకు వెళ్తూ అనంతలోకాలకు

మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, డీసీఎం వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మరణించారు.

Maharashtra Road Accident : ఘోర ప్రమాదం, ఆరుగురు దుర్మరణం.. వివాహ వేడుకు వెళ్తూ అనంతలోకాలకు

Maharashtra Road Accident : మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, డీసీఎం వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు స్పాట్ లోనే మరణించారు. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో మంజార్‌సంబా-పటోడా హైవేపై ఈ యాక్సిడెంట్ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.

జివాచివాడికి చెందిన ఐదుగురు కుటుంబ సభ్యులు ఓ కారులో పుణెలో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వారి కారును ఓ టెంపో ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. రెండు వాహనాలను క్రేన్‌ సహాయంతో వేరు చేశామని చెప్పారు. వివాహ వేడుకకు వెళ్తున్న సమయంలో వారిని మృత్యువు కబలించడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.