goli maro : రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో టెన్షన్

  • Published By: madhu ,Published On : February 29, 2020 / 12:07 PM IST
goli maro : రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో టెన్షన్

దేశ రాజధానిలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈశాన్య ఢిల్లీలో ముష్కరులు సాగించిన హింసాకాండ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్రమంలో మరోసారి గుర్తు తెలియని వ్యక్తులు చేసిన నినాదాలు ప్రకంపనలు సృష్టించాయి. 2020, ఫిబ్రవరి 29వ తేదీ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద యదావిధిగానే రద్దీగానే ఉంది. ప్రయాణీకులు రాకపోకలు సాగిస్తున్నారు. కానీ ఒక్కసారిగా..కొంతమంది యువకులు పెద్దపెట్టున్న నినాదాలు చేయడం ప్రారంభించారు. 

దేశ్ కి గద్దారోంకి..గోలి మారో..అంటూ నినాదాలు చేశారు. ఒక్కసారిగా టెన్షన్ వాతావరణం నెలకొంది. మళ్లా ఏదైనా ముప్పు పొంచి ఉందా అని ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సీఏఏను వ్యతిరేకిస్తూ..కొన్ని నెలలుగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల కింద అల్లర్లు పెద్దపెట్టున్న సాగాయి. ఢిల్లీ మెట్రో బ్లూ లైన్ రైలు లోపల దేశ ద్రోహులను కాల్చండి..అంటూ నినాదాలు కూడా వినిపించినట్లు తెలుస్తోంది. 
Also Read | అతడు-ఆమె-అఫైర్ : కార్తీక్ హత్య రాగసుధల ఆత్మహత్య కేసులో షాకింగ్ విషయాలు!!

గోలీ మారో అనే నినాదం..ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు వినిపించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన నినాదాలు వివాదాస్పదమయ్యాయి. విధ్వేషపూరిత ప్రసంగం చేసినందుకు గాను..ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరుగుతోంది. కుంకుమ కలర్‌తో కూడుకున్న టీషర్టులు, కుర్తా ధరించిన ఐదుగురు వ్యక్తులు మెట్రో స్టేషన్ వద్ద రైలు ఆగిన సందర్భంలో నినాదాలు చేశారని కొంతమంది తెలిపారు. 

రైల్వే స్టేషన్‌లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డు చేశాయి. నినాదాలు చేస్తున్న వారిని వీడియో తీయడానికి చాలా మంది భయపడ్డారని సమాచారం. సమాచారం తెలుసుకున్న CISF సిబ్బంది నిరసనకారులను అడ్డగించి ఢిల్లీ పోలీసులకు అప్పగించింది. 

Read More : బిగ్ బ్రేకింగ్ : సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ
దీనిపై CISF ఒక ప్రకటన విడుదల చేసింది. 
2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం ఉదయం 10.25గంటలకు ఆరుగురు యువకులు ఢిల్లీలోని రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ వద్ద నినాదాలు చేస్తూ కనిపించారని వెల్లడించింది. వెంటనే వారిని తమ సిబ్బంది అడ్డగించి..తదుపరి విచారణ కోసం మెట్రో రైల్వే పోలీసు అధికారులకు అప్పగించారని తెలిపింది. యువకులు సీఏఏకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారని, తాము ఆరుగురిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని డీసీపీ (Metro) విక్రమ్ పోర్వాల్ వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.