డ్రైవర్ నిద్రమత్తే కారణం : రెండు బస్సులు ఢీ..60మంది మృతి

డ్రైవర్ నిద్రమత్తే కారణం : రెండు బస్సులు ఢీ..60మంది మృతి

డ్రైవర్ నిద్రమత్తే కారణం : రెండు బస్సులు ఢీ..60మంది మృతి

 పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం(మార్చి-22,2019) ఉదయం రాజధాని ఆక్రాకి 430కిలోమీటర్ల దూరంలోని
 బోనో తూర్పు ప్రాంతంలోని అంపొమా టౌన్ లోని కిన్ టాంపో టెకిమన్ రోడ్డుపై రెండు బస్సులు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 60మంది ప్రయాణికులు చనిపోయారు.మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.ఘటనాస్థలానికి చేరుకున్న సహాయక బృందాలు క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించారు.రెండు బస్సుల్లో కలిపి  100 మంది ప్రయాణికులు ఉన్నారని, ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఓ బస్సులో మంటలు కూడా చెలరేగాయని,ప్రయాణికులందరూ గుర్తుపట్టడానికి వీల్లేకుండా అగ్నిలో కాలిపోయారని స్థానిక అధికారులు తెలిపారు.ప్రమాదానికి గల కారణం ఇంకా అధికారులు ప్రకటించలేదు.

అయితే ఓ బస్సు డ్రైవర్ నిద్రమత్తులో  అదుపుతప్పి మరో బస్సుని ఢీకొట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది.హాస్పిటల్ లో 28మంది ట్రీట్మెంట్ పొందుతున్నారని,వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని కిన్ టాంపో గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ క్వామి అర్హిన్ తెలిపారు.
 

×