అసలేం జరిగింది : గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి చనిపోయాడు. తీవ్రగాయాలతో స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు.

  • Published By: veegamteam ,Published On : October 15, 2019 / 03:31 AM IST
అసలేం జరిగింది : గచ్చిబౌలిలో ఇన్ఫోసిస్ ఉద్యోగి ఆత్మహత్య

హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి చనిపోయాడు. తీవ్రగాయాలతో స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు.

హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి చనిపోయాడు. తీవ్రగాయాలతో స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు. మృతుడి పేరు రఘురాం. వయసు 35ఏళ్లు. గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. రఘురాం మానసిక పరిస్థితి బాగోలేదని కుటుంబసభ్యులు తెలిపారు. బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నాడని చెప్పారు.

సోమవారం(అక్టోబర్ 14,2019) సాయంత్రం డ్యూటీ ముగిశాక రఘురాం తన భార్య శ్రీదేవితో ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. శ్రీదేవి కూడా అదే ఆఫీస్ లో జాబ్ చేస్తుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి.. రఘురాం మంత్రి(mantri) అపార్ట్ మెంట్ పైకి వెళ్లాడు. అక్కడి నుంచి దూకేశాడు. 

రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. రఘురాం మృతికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. కుటుంబసభ్యులు, ఆఫీస్ లో సహచరులను విచారిస్తున్నారు. రఘురాం స్వస్థలం ఏపీలోని విజయవాడ. 8ఏళ్ల క్రితం శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. రఘురాం శ్రీదేవి దంపతులకు ఆరేళ్ల పాప ఉంది. రఘురాం కుటుంబం చందానగర్ లో నివాసం ఉంటోంది. ఈ ఘటనతో రఘురాం కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.