పెళ్లి చేయాలని తల్లి గొంతు కోసిన కొడుకు
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దారుణం జరిగింది. పెళ్లి చేయాలంటూ కత్తితో తల్లి గొంతు కోసాడు ఓ కసాయి కొడుకు.

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దారుణం జరిగింది. పెళ్లి చేయాలంటూ కత్తితో తల్లి గొంతు కోసాడు ఓ కసాయి కొడుకు.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దారుణం జరిగింది. పెళ్లి చేయాలంటూ కత్తితో తల్లి గొంతు కోసాడు ఓ కసాయి కొడుకు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎఫ్ కాలనీలో చోటు చేసుకుంది. సంధ్యారాణి, ప్రశాంత్ తల్లీకొడుకులు. కాగజ్‌నగర్ పట్టణంలోని ఎఫ్ కాలనీలో నివాసముంటున్నారు. సంధ్యారాణి అంగన్‌వాడీలో ఆయాగా పనిచేస్తున్నారు. ప్రశాంత్ మద్యానికి బానిసయ్యాడు. తల్లి సంధ్యారాణిని కొడుకు ప్రశాంత్ తరచూ డబ్బుల కోసం వేధించేవాడు.
ప్రశాంత్ చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడు. తనకు పెళ్లి చేయాలని ఆరు నెలల నుంచి తల్లితో గొడవ పడుతున్నాడు. ఎప్పటిలాగే రాత్రి సంధ్యారాణితో గొడవ పడిన కొడుకు ప్రశాంత్.. గురువారం(నవంబర్ 21, 2019) తెల్లవారుజామున కత్తితో తల్లి గొంతు కోశాడు.
దాడి చేస్తున్న సమయంలో తల్లి అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని ఆమెను కాపాడారు. స్థానికులు రావడంతో నిందితుడు ప్రశాంత్ పరారయ్యాడు. తీవ్రమైన గాయాలైన తల్లి సంధ్యరాణిని హైదరాబాదుకు తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు.