అత్త ముక్కు కొరికేసిన అల్లుడు : చెవి కోసేసిన తండ్రి

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 06:08 AM IST
అత్త ముక్కు కొరికేసిన అల్లుడు : చెవి కోసేసిన తండ్రి

కన్నకూతుర్ని ఇచ్చి పెళ్లి చేసి..లక్షల కొద్దీ కట్నకానులిచ్చి కూతుర్ని ఏ కష్టం లేకుండా చూసుకోమని అల్లుడికి అప్పజెప్పింది ఓ తల్లి. అన్నీ ముచ్చట్లు డిమాండ్ చేసి మరీ జరిపించుకున్నారు మగపెళ్లివారు. అన్నీ తీసుకుని కూడా కుమార్తెను నానా కష్టాలకు గురిచేస్తుంటే చూసి తట్టుకోలేకపోయింది ఆ తల్లి. మానసికంగా..శారీరకంగా కూతుర్ని అత్తింటివారు వేధిస్తుంటే అదేమని అడిగింది. అదే ఆమె చేసిన పాపం. నన్నే ప్రశ్నిస్తావా అంటు అల్లుడు అత్తగారి ముక్కుని కొరికేశాడు. అతని తండ్రి వియ్యపురాలి చెవిని కత్తితో కోసేశాడు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్ బరేలిలో ఆదివారం (ఆగస్టు 25) చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రెహమాన్‌, గుల్షన్ దంపతుల కుమార్తె చాంద్‌ బీ. ఆమెను  మొహమ్మద్‌ అష్వక్‌ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. కట్నం కింద రూ.10 లక్షలతో పాటు ఇతర కానుకలు కూడా ఘటనంగా ఇచ్చారు. పెళ్లైత తరువాత చాంద్ బీ ఆడబిడ్డకు పుట్టింది. అప్పటి నుంచి చాంద్ బీకి నరకం చూపిస్తున్నారు అత్తింటివారు. ఆడపిల్లని కన్నావు కాబట్టి అదనపు కట్నంగా మరో రూ.5లక్షలు  తేవాలని వేధించటం ప్రారంభించారు భర్తతో సహా అత్తింటివారు. ఎందుకు తేవాలని చాంద్ బీ ప్రశ్నించేది. కొడితే భరించేది తప్ప తల్లిదండ్రులకు ఒక్కమాట కూడా చెప్పలేదు.కానీ కన్నవారు కాబట్టి వారు తెలుసుకున్నారు. దీంతో అల్లుడి ఇంటికి వెళ్లి ఆడపిల్ల పుట్టిందని చాంద్ బీని బాధించటం భావ్యకాదని వేడుకుంది. 

వారి మాటలు వినకుండా ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుండటంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం పెరిగింది. దీంతో విచక్షణ మరచిన అల్లుడు అష్వక్ అత్తపై దాడి చేసి ముక్కును కొరికేశాడు. అతడి తండ్రి ఇజార్‌ కూడా గుల్షన్‌పై దాడి చేసి కత్తితో ఆమె చెవిని కోసేశాడు. తరువాత ఇద్దరు పరారయ్యారు. 

తీవ్ర రక్తస్రావంతో స్పృహ కోల్పోయిన గుల్షన్‌ను ఆస్పత్రికి తరలించారు. అనంతరం అల్లుడు, వారి కుటుంబ సభ్యులపై పోలీసులకు కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న అష్వక్ అతని తండ్రి గురించి గాలిస్తున్నారు.