భార్యని కాపురానికి పంపలేదని.. మామపై అల్లుడు కాల్పులు

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌ పల్లెలో కాల్పుల కలకలం చెలరేగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో మామపై అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో

  • Published By: veegamteam ,Published On : February 4, 2020 / 03:00 AM IST
భార్యని కాపురానికి పంపలేదని.. మామపై అల్లుడు కాల్పులు

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌ పల్లెలో కాల్పుల కలకలం చెలరేగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో మామపై అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌ పల్లెలో కాల్పుల కలకలం చెలరేగింది. తన భార్యను కాపురానికి పంపడం లేదనే కోపంతో మామపై అల్లుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో మామకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి మండలం ఇస్రాజ్‌ పల్లెకు చెందిన బూరుగు గంగయ్య-సత్తవ్వల కూతురు మౌనిక, మేడిపల్లి మండలం గోవిందారం గ్రామానికి చెందిన ప్యాట శ్రీనివాస్ కు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో మౌనిక పుట్టింటికి వచ్చింది. 

అయితే, శ్రీనివాస్‌ సోమవారం(ఫిబ్రవరి 03,2020) రాత్రి 10 గంటల ప్రాంతంలో అత్తింటికి వచ్చి మౌనికతో గొడవపడసాగాడు. మౌనిక తన మేనమామ భైరం రాజిరెడ్డికి సమాచారం ఇచ్చింది. రాజిరెడ్డి వస్తుండగానే.. శ్రీనివాస్‌ వెంట తెచ్చుకున్న తుపాకీతో రెండుసార్లు కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్‌ రాజిరెడ్డి కడుపులోకి, ఇంకోటి చేతి నుంచి దూసుకెళ్లాయి. భార్యాభర్తల మధ్య గొడవలో సర్ది చెప్పేందుకు వచ్చిన రాజిరెడ్డి.. బుల్లెట్ గాయాలకు గురై ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు.

కాగా స్థానికులు మరోలా చెబుతున్నారు. శ్రీనివాస్ కు అతని భార్య గీతికకు మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో కొన్ని రోజులుగా గీతిక తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇస్రాజ్ పల్లిలోని మేనమామ ఇంట్లో ఉంటోంది. అర్థరాత్రి సమయంలో తుపాకీతో వచ్చిన శ్రీనివాస్ గొడవకు దిగాడు. తుపాకీతో భార్యను కాల్చేందుకు యత్నించాడు. ఈ క్రమంలో అడ్డు వచ్చిన రాజిరెడ్డికి బుల్లెట్ గాయాలు అయ్యాయని చెప్పారు. తీవ్రంగా గాయపడిన రాజిరెడ్డిని జగిత్యాల జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ లోని ఆసుపత్రికి తరలించారు.

కాల్పుల ఘటన కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అసలు కాల్పులకు కారణం ఏమిటి? తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది? అనే వివరాలు తెలుసుకునే పనిలో పడ్డారు. పోలీసులు స్పాట్ లో రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.