జయరామ్ హత్య కేసు : జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్‌కి లింకులు !

  • Published By: madhu ,Published On : February 20, 2019 / 01:43 PM IST
జయరామ్ హత్య కేసు : జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్‌కి లింకులు !

ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్నారై జయరామ్ హత్య కేసు సినిమా థ్రిల్లర్‌ని తలపిస్తోంది. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి పోలీసులు సహకరించారని తేలడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబుల పేర్లు బయటపడగా తాజాగా రాకేష్ రెడ్డితో…జూబ్లిహిల్స్ ఇన్స్ పెక్టర్ హరిశ్చంద్రారెడ్డికి లింకులున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసులో రాంబాబును హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాకేష్ రెడ్డి కాల్ డేటాను విశ్లేషించగా పోలీసుల పాత్ర బయటపడినట్లు తెలుస్తోంది. హత్యకు సంబంధించిన దానిలో పోలీసులు సలహాలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. 

ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబులను విచారించారు. సుమారు మూడు గంటల పాటు విచారణ జరిగింది. ల్యాండ్‌కు సంబంధించిన విషయంలో రాకేష్ రెడ్డికి కాల్ చేయడం జరిగిందని మల్లారెడ్డి పేర్కొన్నట్లు తెలుస్తోంది. నల్లకుంట సీఐ శ్రీనివాస్‌పై కూడా కూపీ లాగుతున్నారు. జయరామ్ డెడ్ బాడీని నందిగామ వరకు సేఫ్‌గా తీసుకెళ్లేందుకు పోలీసులు సహకరించారా ? అనే దానిపై పోలీసులు దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. తాజాగా జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ హరిశ్చంద్రారెడ్డి పేరు బయటపడడం కలకలం రేగింది. రాకేష్ రెడ్డికి…హరిశ్చంద్రారెడ్డికి లింకులున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు గుర్తించినట్లు సమాచారం. 

హత్య కేసుకు సంబంధించిన వివరాలు డీసీపీ ఎఆర్ శ్రీనివాసులు వెల్లడించారు. పోలీసుల పాత్ర ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి, నల్లకుంట సీఐ శ్రీనివాస్‌లను తప్పించటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. హత్యకు ముందు..తరువాత రాకేష్ రెడ్డి కాల్ డేటా ఆధారంగా విచారణ సాగుతోందన్నారు. రాయదుర్గం సీఐ ఫోన్ కాల్ తరువాత జూబ్లీహిల్స్ పోలీసులకు రాకేశ్ ఫోన్ చేసినట్లు పేర్కొన్నారు. పోలీసుల విచారణలో ఎలాంటి వివరాలు బయటకొస్తాయో చూడాలి.