సీసీ కెమెరాల్లో సూసైడ్ బాంబర్ : ఆత్మాహుతికి ముందు పిల్లలతో ముచ్చట్లు

శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో 321 మంది మృతి చెందగా వందలాది మంది గాయాలపాలయ్యారు.

  • Published By: veegamteam ,Published On : April 23, 2019 / 11:52 AM IST
సీసీ కెమెరాల్లో సూసైడ్ బాంబర్ : ఆత్మాహుతికి ముందు పిల్లలతో ముచ్చట్లు

శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో 321 మంది మృతి చెందగా వందలాది మంది గాయాలపాలయ్యారు.

శ్రీలంక పేలుళ్లకు తామే బాధ్యులమని ఐసిస్ ప్రకటించింది. వరుస బాంబు పేలుళ్లలో 321 మంది మృతి చెందగా వందలాది మంది గాయాలపాలయ్యారు. కొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. వరుస బాంబు పేలుళ్లకు సంబంధించి కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఓ సూసైడ్ బాంబర్ చర్చీలోకి వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి.
Also Read : మీరు రెడీనా? : పెరగనున్న జియో టారిఫ్ ధరలు?

పేలుడు పదార్ధాలున్న బ్యాగ్ తో సూసైడ్ బాంబర్ చర్చిలోకి వెళ్లాడు. తనను తాను పేల్చేసుకున్నాడు. లైట్ గా గడ్డం పెంచుకున్న సూసైడ్ బాంబర్.. ఒక చేతిలో సెల్ ఫోన్, భుజంపై బ్యాగ్, నడుముకు బెల్ట్ బాంబు ధరించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. చర్చిలోకి వెళ్లే ముందు సూసైడ్ బాంబర్ చేతిలో సెల్ ఫోన్ తోపాటు నడుము భాగంలో ఉన్న బెల్ట్ బాంబును సెట్ చేసుకుంటున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయ్యాయి. 

చర్చిలోకి వెళ్లే ముందు.. అదే ప్రాంగణంలో తండ్రితో కలిసి వెళ్తున్న చిన్నారిని ముద్దాడాడు. ప్రేమగా తలపై నిమిరాడు. చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా కనిపించాడు. వందల మందిని చంపుతున్నాను.. బాంబుతో మారణహోమం చేస్తున్నాను అన్న భయము, బెరుకు ఏమీ లేవు వాడి ప్రవర్తనలో. చుట్టుపక్కల అందరితో ఎంతో చక్కగా మాట్లాడాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ప్రవర్తించాడు ఈ కిరాతకుడు. ఆ తర్వాత చర్చిలోకి  ప్రవేశించి.. తనను తాను పేల్చేసుకున్నాడు. బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత చర్చి ఆవరణ నుంచి ఓ కుక్క పరుగులు తీసింది. ఆ వెంటనే హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తితోపాటు మరో ఇద్దరు పరుగులు పెట్టారు.
Also Read : చెక్ చేశారా? : Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్

శ్రీలంకలో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి 8 చోట్ల బాంబులు దాడులకు పాల్పడ్డారు. ఈస్టర్ ఆదివారం (ఏప్రిల్ 21)న  చర్చిల్లో ప్రార్థనలకు వచ్చే క్రైస్తవులు, విదేశీ పర్యాటకులు ఎక్కువగా ఉండే మూడు హోటల్స్‌ను టార్గెట్ చేసి మరీ దాడులకు తెగబడ్డారు ఉగ్రవాదులు.