Congo Stampede 11 Died : కాంగో మ్యూజిక్‌ కచేరీలో తొక్కిసలాట.. ఇద్దరు పోలీసులు సహా 11 మంది మృతి

దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మరవకముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్‌ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్రముఖ సంగీత వాయిద్యకారుడు ఫాలీ ఇపుపా కచేరీలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది.

Congo Stampede 11 Died : కాంగో మ్యూజిక్‌ కచేరీలో తొక్కిసలాట.. ఇద్దరు పోలీసులు సహా 11 మంది మృతి

congo stampede

Congo Stampede 11 Died : దక్షిణ కొరియా తొక్కిసలాట ఘటనను మరవకముందే కాంగో రాజధాని కిన్షాసాలో మరో దుర్ఘటన చోటుచేసుకుంది. కిన్షాసాలో జరిగిన ఓ మ్యూజిక్‌ కచేరీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా 11 మంది మృతి చెందారు. ఆదివారం రాత్రి కిన్షాసా స్టేడియంలో ప్రముఖ సంగీత వాయిద్యకారుడు ఫాలీ ఇపుపా కచేరీలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. స్టేడియం వెలుపల ప్రజలను చెదరగొట్టేందుకు భద్రతా అధికారులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించాల్సి వచ్చింది.

కిన్షాసా స్టేడియంలో ప్రముఖ మ్యుజీషియన్‌ ఫాలీ ఇపుపా కచేరీ నిర్వహించారు. ఈ కచేరికి స్టేడియం కెపాసిటీ కన్నా ఎక్కువగా దాదాపు 80 వేల మంది వచ్చారు. కొందరు వీఐపీ, రిజర్వ్‌డ్‌ సెక్షన్లలలోకి బలవంతంగా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. స్టేడియం వెలుపల కూడా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి ఉండి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దాంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులతోపాటు 11 మంది మృతి చెందారు.

Gujarat Bridge Collapses: గుజరాత్‌లో కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో కొనసాగుతున్న సహాయకచర్యలు.. 137కు చేరిన మృతుల సంఖ్య..

పెద్ద సంఖ్యలో మ్యూజిక్‌ లవర్స్‌ రావడం, సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తారని ముందుగా పసిగట్టలేకపోయారని, అందుకే తొక్కిసలాట జరిగినట్లు భావిస్తున్నారు. ఇదిలావుండగా శనివారం సియోల్‌లో జరిగిన తొక్కిసలాటలో 26 మంది విదేశీయులు సహా మొత్తం 153 మంది చనిపోయినట్లు దక్షిణ కొరియా అధికారులు వెల్లడించారు.