పెళ్లి జరగాల్సిన రోజు, సోదరిని పొగపెట్టి చంపిన సవతి సోదరుడు,బంధువులు

పెళ్లి జరగాల్సిన రోజు, సోదరిని పొగపెట్టి చంపిన సవతి సోదరుడు,బంధువులు

Step Brother smothers step-sister to death on her wedding day : పెళ్లి కావాల్సిన రోజే నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మూ కాశ్నీర్ లోని శ్రీనగర్ లో జరిగింది, కానీ పోలీసు విచారణలో అది ఆత్మహత్య కాదని హత్య అని తేలటంతో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీనగర్ లోని సైదాకదాల్ ప్రాంతంలో నివసించే కుటుంబంలోని షహనాజ్ అనే మహిళ నవంబర్ 4న ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని మరణించింది. ఆమెకు అదే రోజు వివాహం జరగాల్సి ఉంది. తన సవతి అన్న కజిన్స్ తో కలిసి ఆమె ఆ ఇంట్లో నివసిస్తోంది. నవంబర్ 4న ఆమెకు పెళ్లి జరగాల్సి ఉంది కానీ ఇంతలో విషాదం జరిగింది.

సమచారం తెలుసుకున్న పోలీసులు అత్మహత్యగా కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఖననం చేశారు. కాగా ఆమెకు కాబోయే భర్త నాసిర్ హుస్సేన్ కవా తనకు కాబోయే భార్య ఆత్మహత్య చేసుకోలేదని….. ఆమెను సవతి సోదరుడు, సోదరులే హత్య చేశారని పిటీషన్ దాఖలు చేశాడు. పిటీషన్ విచారణకు స్వీకరించిన చీఫ్ జ్యూడిషియ్ మజిస్ట్రేట్ నవంబర్ 13న ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికు సమర్పించాలని ఆదేశించారు.

కేసు తిరిగి విచారణ చేపట్టిన పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. పిటీషన్ దారుడి పేర్కోన్న అనుమానితుడైన ఆమె సోదరుడు వాజిద్ గుల్జార్ సుల్తాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు..కొంత విచారణ జరిగే సరికి సవతి సోదరిని హత్య చేసినట్లు వాజిద్ గుల్జార్ ఒప్పుకున్నాడు.

వాజిద్, మొహమ్మద్ షఫీ సూల్తాన్, మరియు వారి సోదరి నిఘాత్ గుల్జార్ తో కలిసి షహనాజ్ ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు, షఫీ సూల్తాన్, నిఘాత్ గుల్జార్ లు బాధితురాలైన షహనాజ్ కు మేనమామ పిల్లలు. మొహమ్మద్ షఫీ, షెహనాజ్ తో సన్నిహితంగా ఉండటానికి ప్రయత్నించాడు. అతడి ప్రయత్నాన్ని ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఆమెను పలు రకాలుగా వేధించసాగాడు. షఫీ సుల్తాన్ షెహనాజ్ పేరు మీద ఉన్న ఆస్తి ,బంగారం కొట్టేయాలని చూశాడు.

అది అయ్యే పనిలా కనిపించలేదు. అందుకని ఆమె సవతి సోదరుడు, తన సోదరి సహాయం కోరాడు. అంతా ఓకే అన్నారు. ఇందులో భాగంగా నవంబర్ 3వ తేదీన షహనాజ్ ను చంపేయాలని నిందితులు ముగ్గురు ప్లాన్ వేశారు. బాధితురాలు ఫజ్ర్ ప్రార్ధనల కోసం నవంబర్ 4న తెల్లవారుఝూమున నిద్ర లేచింది. ఆమె ప్రార్ధన చేస్తున్న సమయంలో ఆమెకు ఊపిరి ఆడకుండా చేయాలని ఆ గదిలో పొగ పెట్టారు. ఆమె ఊపిరాడక స్పహ తప్పి పడిపోయిన పిమ్మట బంగారు రంగు వస్త్రంతో ఆమె పీకకు చుట్టి హత్య చేశారు.

అనంతరం ఆమెను చున్నీతో ఫ్యానుకు వేలాడదీసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్ర్రీకరించారు. షెఙనాజ్ ను హత్య చేసిన విధానాన్నినిందితులు పూసగుచ్చినట్లు పోలీసులకు వివరించారు. నేరం రుజువు కావచంతో పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.