ఫోన్ కొట్టేసిన దొంగ.. 3 కి.మీ ఛేజ్ చేసి పట్టుకున్న యజమాని

ఫోన్ కొట్టేసిన దొంగ.. 3 కి.మీ ఛేజ్ చేసి పట్టుకున్న యజమాని

Stolen Mobile grabbed after thief steals Mobile Phone : ఫోన్ కొట్టేసిన దొంగ వెంటాడి మరి పట్టుకున్నాడో మొబైల్ యజమాని. ఫోన్ దొంగిలించి పారిపోతున్న దొంగను పట్టుకునేందుకు ఏకంగా మూడు కిలోమీటర్లు పరిగెత్తాడు. ఎట్టకేలకు దొంగను పట్టేసుకున్నాడు. దొంగకి ముచ్చెమటలు పట్టించాడు. ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. గత శుక్రవారం చెన్నై పెరుర్‌కు చెందిన పార్తిబన్‌ అనే వ్యక్తి వడ పెరుంబాక్కమ్‌-మాధవరమ్‌ రోడ్డుపై బైక్‌ ఆపి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో దొంగ అతడి చేతిలోని సెల్‌ఫోన్‌ లాక్కుని పరిగెత్తాడు. కంగారుపడిన పార్తిబన్‌ ఆ దొంగవెంట పడ్డాడు.

అలా మూడు కిలోమీటర్ల వరకు పరిగెత్తాడు. ఎంతదూరమైన వదిలిపెట్టేది లేదంటూ దొంగను వెంబడించాడు. చివరికి ఆ దొంగను పట్టేసుకున్నాడు. దొంగిలించిన ఫోన్ దొరికినప్పటికీ.. దొంగ అందినట్టే అంది పారిపోయాడు. ఏదిఏమైనా ఫోన్ దొరికిందిలే అనుకున్న యజమాని.. ఫోన్ చోరీకి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.