Smoking Gun Firing : షాకింగ్.. సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు గన్‌తో కాల్పులు

Smoking Gun Firing : షాకింగ్.. సిగరెట్ తాగొద్దని చెప్పినందుకు గన్‌తో కాల్పులు

Smoking Gun Firing : ఈరోజుల్లో మంచి చెప్పినా పాపంగా మారుతోంది. ఒరేయ్ నాయనా.. ఇది తప్పు అని చెప్పడం కూడా తప్పైపోతోంది. నాకే చెబుతావా, నన్నే ఆపుతావా అంటూ కొందరు వ్యక్తులు రెచ్చిపోతున్నారు. కోపంతో ఊగిపోతూ విచక్షణ కోల్పోయి దాడులకు తెగబడుతున్నారు. ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడటం లేదు.

తాజాగా గురుగ్రామ్ లో అలాంటి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కిరాణ స్టోర్ లో సిగరెట్ తాగనివ్వకుండా అడ్డుకున్న సిబ్బందిపై ఓ వ్యక్తి కాల్పులు జరపడం కలకలం రేపింది.

Also Read : Mexican Woman Killed : 5వేల కి.మీ ప్రయాణించి తన కోసం వచ్చిన ప్రియురాలిని హత్య చేసి అవయవాలు అమ్ముకున్నాడు

ఓ గుర్తు తెలియని వ్యక్తి గురుగ్రామ్ సెక్టార్ 22లోని ఓ కిరాణ స్టోర్ కి వెళ్లాడు. వస్తువులు కొనుగోలు చేసేందుకు వెళ్లిన అతడు అక్కడే సిగరెట్ తాగే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన సిబ్బంది వెంటనే.. ఆ వ్యక్తిని ఆపారు. సిగరెట్ తాగుతుండగా అభ్యంతరం తెలిపారు. ఇక్కడ సిగరెట్ తాగొద్దు, బయటికి వెళ్లండి అని చెప్పారు.

Also Read : Australia Woman Murder Case : బాబోయ్.. తనను చూసి కుక్క మొరిగిందని చంపేశాడు.. ఆస్ట్రేలియాలో యువతి హత్య వెనుక షాకింగ్ నిజం

అంతే, ఆ వ్యక్తి కోపంతో ఊగిపోయాడు. నన్నే అవమానిస్తారా అంటూ చిందులు తొక్కాడు. తను కొనుగోలు చేసిన వస్తువులు తీసుకుని బయటకు వెళ్లాడు. వాటిని కారులో పెట్టాడు. ఆ తర్వాత గన్ తీసి దాన్ని లోడ్ చేశాడు. మళ్లీ స్టోర్ లోకి వెళ్లాడు. సిగరెట్ తాగొద్దని చెప్పిన సిబ్బందిపై అతడు కాల్పులు జరిపాడు. ఈ అనూహ్య పరిణామంతో సిబ్బంది బిత్తరపోయారు. కాల్పులు జరపడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. పక్కకు జరగడంతో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

సిగరెట్ తాగనివ్వకుండా స్టోర్ సిబ్బంది తనను అవమానించారని, అందుకే కాల్పులు జరిపానని దుండగుడు చెప్పాడు. కాల్పులు జరిపిన తర్వాత అతడు అక్కడి నుంచి తన కారులో పారిపోయాడు. స్టోర్ సిబ్బంది ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. మర్డర్ అటెంప్ట్ (307 సెక్షన్) కింద కేసు నమోదు చేశారు. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ ఆధారంగా, కారు నెంబర్ సాయంతో దుండగుడిని పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.