అసలేం జరిగింది : వనస్థలిపురంలో డీమార్ట్‌కి వెళ్లిన విద్యార్థి మృతి

హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. వనస్థలిపురంలోని డీమార్ట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు.

  • Published By: veegamteam ,Published On : February 17, 2020 / 05:11 AM IST
అసలేం జరిగింది : వనస్థలిపురంలో డీమార్ట్‌కి వెళ్లిన విద్యార్థి మృతి

హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. వనస్థలిపురంలోని డీమార్ట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లాడు.

హైదరాబాద్ వనస్థలిపురంలో విషాదం నెలకొంది. ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని సతీష్ గా గుర్తించారు. సతీష్.. ఆదివారం(ఫిబ్రవరి 16,2020) రాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి షాపింగ్ కోసం వనస్థలిపురంలోని డీమార్ట్ వెళ్లాడు. అక్కడ డీమార్ట్ సెక్యూరిటీ సిబ్బందికి, సతీష్ కు మధ్య గొడవ జరిగింది. చాక్లెట్ దొంగిలించాడని సెక్యూరిటీ సిబ్బంది సతీష్ ను పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత గొడవ జరిగినట్టు సమాచారం. సెక్యూరిటీ సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే తమ కొడుకు మృతి చెందాడని సతీష్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

సతీష్ మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సతీష్ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. డీమార్ట్ దగ్గర ఏం జరిగింది? సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు కారణం ఏంటి? సెక్యూరిటీ సిబ్బంది కొట్టిన దెబ్బల వల్లే సతీష్ చనిపోయాడా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాల్సి ఉంది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక కానీ.. మృతికి కారణం ఏంటో చెప్పలేమని పోలీసులు తెలిపారు. పోలీసులు సతీష్ తో పాటు డీమార్ట్ వెళ్లిన ఫ్రెండ్స్ ని విచారిస్తున్నారు. అలాగే డీమార్ట్ సెక్యూరిటీని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. డీమార్ట్ దగ్గర సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఏదైనా క్లూ దొరుకుతుందేమోనని చూస్తున్నారు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. త్వరలోనే మిస్టరీ చేధిస్తామన్నారు. మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేస్తామన్నారు.

సతీష్ హయత్ నగర్ లోని శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. డీమార్ట్ యాజమాన్యంపై సతీష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరదాగా షాపింగ్ కోసం డీమార్ట్ వెళ్లిన కుర్రాడు.. ఇలా చనిపోవడం అందరిని షాక్ కి గురి చేసింది.

1

Read More>>చనిపోయిన కొడుకు గుండె చప్పుడు వేరొకరిలో విన్న తండ్రిపిల్లలను వేధిస్తున్న ఆరున్నర కోట్ల ఏళ్ల క్రితం డైనోసర్ జబ్బు