రైల్లో ఫోన్లు చోరీ : విద్యార్థిపై దాడి చేసి చంపిన దొంగలు

కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.

  • Published By: sreehari ,Published On : September 26, 2019 / 08:11 AM IST
రైల్లో ఫోన్లు చోరీ : విద్యార్థిపై దాడి చేసి చంపిన దొంగలు

కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు.

కదులుతున్న రైల్లో 23ఏళ్ల విద్యార్థిపై దాడి చేసి చంపేశారు దుండగులు. కొంతమంది దొంగలు రైల్లోకి చొరబడి విద్యార్థి దగ్గర ఉన్న రెండు ఫోన్లను లాగేసుకున్నారు. ప్రతిఘటించిన విద్యార్థిపై దాడి చేసిన దొంగలు.. కదులుతున్న రైలు నుంచి కిందికి తోసేశారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన యువకుడు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ ఘటన బెంగళూరులోని కెంగేరి రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.

వివరాల ప్రకారం.. మాండ్యాలోని శంకర్ నగర్ ప్రాంతానికి చెందిన సుమంత్ కుమార్ అనే యువకుడిగా పోలీసులు గుర్తించారు. బెంగళూరులోని తన స్నేహితుడిని కలిసేందుకు బెంగళూరు-మైసూరు MEMU ట్రైన్లో వస్తున్నాడు. కెంగేరి రైల్వే స్టేషన్ నుంచి రైలు కాసేపు ఆగింది. బాగా రద్దీగా ఉన్న రైల్లోకి ఎక్కిన 20మంది దుండగులు అతన్ని చుట్టుముట్టారు. 

సుమంత్ దగ్గర ఉన్న రూ.16వేల విలువైన ఫోన్లను లాగేసుకున్నారు. ప్రతిఘటించిన సుమంత్ పై దొంగలు దాడి చేశారు. అతన్ని బయటకు లాగి రైల్లో నుంచి కిందికి తోసేశారు. సుమంత్ కు తీవ్రగాయాలు కావడంతో అతన్ని చికిత్స నిమిత్తం సమీపంలోని బీజీఎస్ ఆస్పత్రికి తరలించారు. అందిన ఫిర్యాదు మేరకు సిటీ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గతంలో కూడా ఇలాంటి చోరీ ఘటనలు ఎన్నో జరిగాయి. 2019 ఫిబ్రవరిలో కూడా ఇదే రైల్వే స్టేషన్ దగ్గర దేవరాజా అనే వ్యక్తిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. 

అర్జెంట్ కాల్ చేసుకోవాలని ఫోన్ అడిగి తీసుకుని తర్వాత అడిగితే కొట్టారు. ఇటీవల కాలంలో చోరీ ఘటనలు ఎక్కువ అయ్యాయమని, ఎప్పటికప్పుడూ తగిన చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని ఆర్ పీఎఫ్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ చటోపాధ్యాయ బెనర్జీ తెలిపారు. రైళ్లలో, కంపార్ట్ మెంట్లలో నేరాలను నియంత్రించేందుకు తమ పోలీసులు నిఘా పెడుతున్నారని అన్నారు. గత ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది ఇలాంటి కేసులు తగ్గు ముఖం పట్టాయని బెనర్జీ చెప్పారు.