Student Suicide : కొత్త బట్టలకు డబ్బులివ్వలేదని బావిలో దూకి ఆత్మహత్య

కొత్త బట్టలుకొనుక్కోటానికి డబ్బులివ్వలేదని ఒక విద్యార్ధిని బలవన్మరణానికి  పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా లో చోటు చేసుకుంది.

Student Suicide : కొత్త బట్టలకు డబ్బులివ్వలేదని బావిలో దూకి ఆత్మహత్య

Student Suicide

Student Suicide :  తొందరపాటు నిర్ణయాలతో చిన్న చిన్న విషయాలకే కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. కొత్త బట్టలుకొనుక్కోటానికి డబ్బులివ్వలేదని ఒక విద్యార్ధిని బలవన్మరణానికి  పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా లో చోటు చేసుకుంది.

కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన అరెల్ల అఖిల(18) డిగ్రీ ఫస్టియర్ చదువుతోంది. తండ్రి తిరుపతి వ్యవసాయం చేస్తుంటాడు. పండగకు కొత్తబట్టలు కొనుక్కుంటాను రూ.2 వేలు ఇవ్వమని అఖిల తండ్రిని కోరింది. ప్రస్తుతం డబ్బులు లేవని తర్వాత ఇస్తానని తండ్రి చెప్పాడు.
Also Read : Three Missing : ఫోన్‌లో భార్య ఎక్కువగా మాట్లాడిందని మందలిస్తే..!
దీంతోమనస్తాపానికి గురైన అఖిల ఆదివారం అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం సైకిల్ వేసుకుని తండ్రి కౌలు చేసే పొలంలోని వ్యవసాయ బావిలోకి దూకి ఆత్మ హత్య చేసుకుంది. తిరుపతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.