విద్యార్ధినులు ఆదృశ్యం : ఆందోళనలో తల్లితండ్రులు

10TV Telugu News

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా కేశవపట్నం కస్తూరిబాగాంధీ పాఠశాల హాస్టల్ నుంచి ఐదుగురు 10వ తరగతి చదివే విద్యార్థినిలు అదృశ్యం అయ్యారు. వీరంతా గత రాత్రి నుంచి కనిపించకుండా పోయారు. వారి అదృశ్యంపై స్కూల్ ప్రిన్సిపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన విద్యార్థినిల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. అదృశ్యమైన విద్యార్థినిలు ఐశ్వర్య, తేజశ్రీ, రేణుకా, రేవణ్య, భవానిగా గుర్తించారు.  

శనివారం ఉదయం  విద్యార్ధినుల హాజరు తీసుకునే క్రమంలో వీళ్ళు పారిపోయినట్లు గుర్తించారు. గోడకు నిచ్చెన వేసుకుని వీరంతా పారిపోయినట్లు తెలుస్తోంది. ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయని, రాత్రి11-00 వరకు పరీక్షల కోసం చదివించామని, 11-40గంటలవరకు వాళ్ళు హాస్టల్లోనే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కనుగొన్నామని ప్రిన్సిపాల్ చెప్పారు. పారిపోయిన విద్యార్ధినులు చదువులో మంచి మార్కులు తెచ్చుకునే వాళ్లని పరీక్షల భయంతోవారు పారిపోయారనుకోవట్లేదని  ప్రిన్సిపాల్  తెలిపారు. కేసు  నమోదు చేసుకున్న పోలీసులు,  సీసీ టీవీ పుటేజ్ ద్వారా విద్యార్ధినులు ఎక్కడకు వెళ్ళి ఉంటారనే విషయమై విచారణ చేస్తున్నారు.

విద్యార్థినుల  ఆచూకీ తెలిసినవారు కేశవపట్నం ఎస్‌ఐ సెల్‌నెంబర్-9440900980, హుజూరాబాద్ రూరల్ సీఐ- 9440795151 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాల్సిందిగా పోలీసులు తెలిపారు.