పెళ్లయిన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య

అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. కోటి ఆశలతో

  • Published By: naveen ,Published On : June 8, 2020 / 12:20 PM IST
పెళ్లయిన నెలరోజులకే నవ వధువు ఆత్మహత్య

అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. కోటి ఆశలతో

అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానన్నాడు. కోటి ఆశలతో నవ వధువు అత్తారింట్లోకి అడుగుపెట్టింది. కానీ నెల కూడా తిరక్కుండానే ఘోరం జరిగిపోయింది. నవ వధువు ఆత్మహత్యాయత్నం చేసింది. చివరికి చనిపోయింది. 

వరకట్న వేధింపులకు బలి:
వరకట్న వేధింపులు తాళలేక ఆత్మహత్యకు యత్నించిన నవవధువు మృతిచెందింది. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామానికి చెందిన బత్తుల అనూష(22)కు మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడకు చెందిన జనార్దన్‌తో నెల రోజుల క్రితం వివాహం జరిగింది. కొద్ది రోజులకే అదనపు కట్నం తీసుకురావాలని భర్త జనార్దన్, అత్త కృష్ణ కుమారి, మామ భరత్‌కుమార్, ఆడపడుచు వేదవతిలు అనూషను వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన అనూష అత్తగారింట్లోనే జూన్ 5న గుర్తు తెలియని ద్రావకం తాగి పుట్టింటికి వచ్చింది.

కాళ్ల పారాణి ఆరకముందే:
కాసేపటికే అనూష కళ్లు తిరిగి పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే అనూష ఆరోగ్యం మెరుగు పడడంతో 6వ తేదీన వాసాలమర్రిలోని పుట్టింటికి తీసుకొచ్చారు. అదే రోజు మధ్యాహ్నం అనూషకు ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. వరకట్న వేధింపులతోనే తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దుబ్బాల బాలమణి ఆదివారం(జూన్ 7,2020) స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. కాళ్ల పారాణి ఆరక ముందే నవ వధువు చనిపోవడం విషాదం నింపింది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Read: తీవ్ర విషాదం, మాస్కులా చుట్టుకున్న చున్నీ ప్రాణం తీసింది