ఏం జరిగింది : మీర్ పేటలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : November 4, 2019 / 06:53 AM IST
ఏం జరిగింది : మీర్ పేటలో పాలిటెక్నిక్ విద్యార్థిని ఆత్మహత్య

మీర్ పేటలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టించింది. తీగల రామిరెడ్డి పాలిటెక్నిక్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. కానీ ఆమె ఎందుకు చనిపోయిందనేది తెలియరాలేదు. కాలేజీ లెక్చరర్ పార్వతి వేధింపుల వల్లే సంధ్య ఆత్మహత్యకు పాల్పడిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మీర్ పేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. అయితే..పోస్టుమార్టం పూర్తి కాకుండానే దహన సంస్కారాలు చేయడం అనుమానాలు కలుగుతున్నాయి. తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని యాజమాన్యం వెల్లడిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కాలేజీ యాజమాన్యం మాత్రం మీడియా ముందుకు రాలేదు. 

సంధ్య..పాలిటెక్నిక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. నవంబర్ 03వ తేదీ ఆదివారం ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీగల రామిరెడ్డ పాలిటెక్నిక్ కళాశాల వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని ఆరోపిస్తున్నారు. పోస్టుమార్టం నిర్వహించకపోవడం..దహన సంస్కారాలు చేసిన తర్వాత కేసు ఎలా కొనసాగుతుందనేది తెలియ రావడం లేదు. 
Read More : ఆర్టీసీలో రికార్డు సమ్మె