ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి .. 17మంది జవాన్లు మృతి

  • Published By: sreehari ,Published On : March 22, 2020 / 10:02 AM IST
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడి .. 17మంది జవాన్లు మృతి

ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో జవాన్లపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం జరిగిన మావోయిస్టుల దాడిలో 17మంది జవాన్లు అమరులయ్యారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. మావోయిస్టులు ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అప్రమత్తమైన జవాన్లు కూడా ఎదురుకాల్పులు జరిపారు.

రెండున్నర గంటల పాటు జరిగిన కాల్పుల ఘటనలో 12మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. జవాన్ల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్టు ఛత్తీస్ గఢ్ పోలీసులు ధ్రువీకరించారు. 12 ఏకే47 గన్లతో పాటు ఆయుధాలను మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నారని పోలీసులు అధికారులు వెల్లడించారు.  

వేర్వేరు బృందాలకు చెందిన దాదాపు 600 మంది సిబ్బంది జిల్లా రిజర్వ్ గార్డ్(DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), కమాండో బెటాలియన్ బలగాలు ఉన్నాయి. నక్సల్స్ కదలికలు ఉన్నాయనే సమాచారం మేరకు కోబ్రా, సీఆర్పీఎఫ్ చెందిన బలగాలు యాంటీ నక్సల్ ఆపరేషన్ నిర్వహించాయి. సుక్మా జిల్లాలో సెర్చ్ ఆపరేషన్ లాంచ్ చేసిన తర్వాత 17మంది జవాన్లు అదృశ్యమయ్యారు.