సూళ్లూరు ఫ్లెమింగో ఫెస్టివల్ లో అపశ్రుతి : కుర్చీలతో దాడి చేసుకున్న కబడ్డీ క్రీడాకారులు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో అపశ్రుతి చోటచేసుకుంది. ఫెస్టివల్‌లో భాగంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తండగా.. రెండు కబడ్డీ టీమ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

  • Published By: veegamteam ,Published On : January 5, 2020 / 10:10 AM IST
సూళ్లూరు ఫ్లెమింగో ఫెస్టివల్ లో అపశ్రుతి : కుర్చీలతో దాడి చేసుకున్న కబడ్డీ క్రీడాకారులు

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో అపశ్రుతి చోటచేసుకుంది. ఫెస్టివల్‌లో భాగంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తండగా.. రెండు కబడ్డీ టీమ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్లో అపశ్రుతి చోటచేసుకుంది. ఫెస్టివల్‌లో భాగంగా కబడ్డీ పోటీలు నిర్వహిస్తండగా.. రెండు కబడ్డీ టీమ్ ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తడ మండల కాసింగారు కుప్పం, వాట౦బేడు కుప్పం గ్రామ క్రీడాకారుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. 

కబడ్డీ  ఆడుతున్న సందర్భంలో ఓ టీమ్‌కు చెందిన వ్యక్తి అవుటైన సమయంలో..ఉద్దేశ పూర్వకం గానే అవుటైన వ్యక్తిపైన ప్రత్యర్థి జట్టు సభ్యులు దాడికి పాల్పడ్డారు. దీంతో రెండు జట్ల మధ్య ఘర్షణ తలెత్తింది. రెండు టీమ్‌ల సభ్యులు  కుర్చీలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. 

ఈ దాడిలో ఇద్దరికి గాయాలు కావడంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అదించారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమనిగింది. పాతకక్షల నేపథ్యంలోనే ఈ దాడులు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.