బిట్ కాయిన్ పొంజి స్కామ్: మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ కు బెయిల్

బిట్ కాయిన్ పొంజి స్కామ్.. ఈ పేరు వింటేనే దేశంలో వేలాది మంది బాధితుల గుండెలు అదిరిపోతాయి. పొజి స్కీమ్స్ మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ పేరు చెబితే గజగజ వణికిపోతారు.

  • Published By: sreehari ,Published On : April 4, 2019 / 11:16 AM IST
బిట్ కాయిన్ పొంజి స్కామ్: మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ కు బెయిల్

బిట్ కాయిన్ పొంజి స్కామ్.. ఈ పేరు వింటేనే దేశంలో వేలాది మంది బాధితుల గుండెలు అదిరిపోతాయి. పొజి స్కీమ్స్ మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ పేరు చెబితే గజగజ వణికిపోతారు.

బిట్ కాయిన్ పొంజి స్కామ్.. ఈ పేరు వింటేనే దేశంలో వేలాది మంది బాధితుల గుండెలు అదిరిపోతాయి. పొజి స్కీమ్స్ మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ పేరు చెబితే గజగజ వణికిపోతారు. అప్పట్లో సంచలనం సృష్టించిన రూ.2వేల కోట్ల బిట్ కాయిన్ ఆధారిత పొజి పథకాల కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన అమిత్ భరద్వాజ్ కు మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అమిత్ కు రూ.10 కోట్ల పూచికత్తు, అతడి సోదరుడు, బ్రోకర్ వివేక్ భరద్వాజ్ కు రూ.1 కోటి పూచికత్తుతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అమిత్ ఆరోగ్య సమస్యల దృష్ట్యా సుప్రీం అతడికి బెయిల్ జారీ చేసింది. 

ఈ సందర్భంగా భరద్వాజ్ న్యాయవాది దీపక్ ప్రకాశ్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ఆరోగ్య సమస్యల కారణంగా భరద్వాజ్ సోదరులకు కోర్టు పూచికత్తుపై మధ్యంతర బెయిల్ మంజూరు చేసినటట్టు తెలిపారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భరద్వాజ్ సోదరులపై నమోదైన మొత్తం 12 కేసులను కలిపి సుప్రీంకోర్టు విచారించాల్సిందిగా కోరినట్టు ఆయన తెలిపారు. ఈ కేసులన్నింటిపై ఏప్రిల్ 27, 2019లో సుప్రీంలో విచారణకు రానున్నట్టు చెప్పారు. అమిత్ భరద్వాజ్ కేసుపై ఏప్రిల్ 2న బాంబే హైకోర్టులో విచారణకు రావాల్సి ఉండగా.. ఏప్రిల్ 22న విచారించే అవకాశం ఉన్నట్టు ప్రకాశ్ తెలిపారు. 

బిట్ కాయిన్ ఇన్వెస్ట్ ప్లాన్ లో భాగంగా అమిత్ ఎన్నో క్రిప్టో కంపెనీలను స్థాపించాడు. గెయిన్ బిట్ కాయిన్ అనే కంపెనీలో తన బ్రోకర్ వివేక్ తో కలిసి 18 నెలల్లో బిట్ కాయిన్ పై ఇన్వెస్ట్ చేస్తే నెలకు 10 శాతం ప్రాఫిట్స్ పొందవచ్చుని బాధితులను నమ్మించారు. అలా.. 300 మిలియన్లు డాలర్లు (రూ.2వేల కోట్లు) కుంభకోణానికి పాల్పడ్డారు. ఈ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమిత్ ను మార్చి 2018లో బ్యాంకాక్ లో అరెస్ట్ చేసి పుణెకు తీసుకొచ్చారు.

అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నెలల పాటు దుబాయ్ లో తలదాచుకున్నాడు. అరెస్ట్ చేసే సమయంలో దుబాయ్ ఎయిర్ పోర్టులో గుండెనొప్పి వచ్చినట్టు నాటకం ఆడాడు. పాకిస్థాన్ ఇంటిలెజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ తో కూడా భరద్వాజ్ కు సంబంధాలు ఉన్నట్టు విచారణలో అంగీకరించాడు. భరద్వాజ్ అరెస్ట్ కావడంతో పొంజి స్కామ్ లో మోసపోయిన వేలాది మంది బాధితులకు భారీ ఉపశమనం కలిగినట్టయింది.