నిఘా కెమెరాల కంపెనీ.. తమ మహిళా ఉద్యోగులపైనే నిఘా పెట్టింది!

  • Published By: sreehari ,Published On : October 27, 2020 / 02:55 PM IST
నిఘా కెమెరాల కంపెనీ.. తమ మహిళా ఉద్యోగులపైనే నిఘా పెట్టింది!

own facial recognition technology: నిఘా కెమెరాల కంపెనీ తమ దగ్గర పనిచేసే మహిళా ఉద్యోగులపైనే వేధింపులకు పాల్పడింది. సొంత ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని ఉపయోగించి లైంగిక వేధింపులతో పాటు వారిపై వివక్షత చర్యలకు పాల్పడినట్టు ఓ నివేదిక వెల్లడించింది.

మహిళా ఉద్యోగులను కంపెనీ తమ సొంత ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్‌తోనే వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. సిలికాన్ వ్యాలీలోని నిఘా కెమెరాల కంపెనీ Verkada సేల్స్ డైరెక్టర్‌ దీనికి కారణమని కంపెనీ దర్యాప్తులో తేలింది.



తమ సొంత సెక్యూరిటీ కెమెరాలపై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. గత ఏడాదిలో కంపెనీ సేల్స్ డైరెక్టర్.. మహిళా ఉద్యోగుల ఫొటోలను సెక్యూరిటీ కెమెరాలతో యాక్సస్ చేశాడు. ఆ ఫొటోలను Slack channel పోస్టు చేశాడు. మహిళా ఉద్యోగుల ఫొటోలను ఫేస్ మ్యాచ్ చేస్తూ పోస్టు చేశాడు. ఆ ఫొటోలు ఇతర ఉద్యోగులకు షేర్ కావడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.



ఈ విషయాన్ని బాధిత మహిళా ఉద్యోగులు.. సేల్స్ టీంలోని సహా ఉద్యోగులతోపాటు కంపెనీ HR కూడా కంప్లయింట్ చేశారు. ఈ ఘటన తర్వాత కంపెనీ సీఈఓ Filip Kaliszan స్లాక్ ఛానెల్ ఉద్యోగులకు ఒక ఆప్షన్ ఇచ్చారు.

కంపెనీ వదిలి వెళ్లడం లేదా స్టాక్ ఆప్షన్స్ తగ్గించడం ఏదో ఒకటి ఎంచుకోవాలని సూచించారు. దాంతో అందరూ ఉద్యోగులు స్టాక్ ఆప్షన్ మాత్రమే ఎంచుకున్నారు.



కంపెనీ నిర్ణయంపై కొందరు ఉద్యోగులంతా అసహనం వ్యక్తం చేశారు. వేధింపుల ఘటనకు సంబంధించి అక్టోబర్ 23న కంపెనీ నుంచి ఉద్యోగులకు ఒక మెయిల్ వెళ్లింది. దీనిపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని, బాధ్యులు ఎవరో గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఈ దర్యాప్తులో ఒక వ్యక్తిని బాధ్యుడిగా తేల్చారు. కంపెనీలో పనిచేసే మహిళలపై లైంగిక వేధింపులు, వివక్షితపూరితంగా వ్యవహరిస్తే ఊపేక్షించేది లేదని కంపెనీ ప్రతినిధి ఒకరు హెచ్చరించారు.