Actress Chandini : మాజీ మంత్రిపై సినీ నటి ఆరోపణలు

తమిళనాడుకు చెందిన వర్ధమాన నటి చాందిని మాజీ మంత్రి మణికందన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా మెలిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ చాందినీ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Actress Chandini : మాజీ మంత్రిపై సినీ నటి ఆరోపణలు

Actress Chandini

Actress Chandini : తమిళనాడుకు చెందిన వర్ధమాన నటి చాందిని మాజీ మంత్రి, అన్నాడీఎంకే నేత డాక్టర్. మణికందన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదేళ్లుగా తనతో సన్నిహితంగా మెలిగి ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆరోపిస్తూ చాందినీ చెన్నై పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.

తామిద్దరికీ ఐదేళ్ల పరిచయం ఉందని పెళ్లి చేసుకోమని అడిగేసరికి ఇప్పుడు బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కోంది. మణికందన్ పై ఆమె చీటింగ్, లైంగిక దాడి కేసులు పెట్టింది. ఐదేళ్లుగా తామిద్దరం రిలేషన్షిప్ లో ఉన్నామని, తనను గర్భవతిని చేసి, అబార్షన్ చేయించాడని ఆమె విలేకరులకు వివరించింది. పెళ్లి చేసుకోమని కోరితే కుదరదు అంటున్నాడని, గట్టిగా అడిగితే తన గూండాలతో చంపిస్తానని, తామిద్దరి ప్రైవేట్ పోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది.

మణికందన్ తో కలిసి పలు చోట్ల దిగిన ఫోటోలను, వాట్సప్ చాటింగ్ లను బయట పెట్టిన చాందిని తనకు న్యాయం జరిగే వరకు వదిలిపెట్టేది లేదని తేల్చి చెప్పింది. అసెంబ్లీతో సహ పలు చోట్ల మణికందన్, తనతో సన్నిహితంగా ఉన్నాడని… ఈ సంగతి అందరికీ తెలుసని ఆమె చెప్పారు. ఆయన భార్యగా తమిళనాడు అసెంబ్లీకి, ఢిల్లీ, పాండిచ్చేరితో సహా పలు ప్రాంతాలకు తనను తీసుకు వెళ్లారని, అందుకు సంబంధించిన ఆధారాలు… అబార్షన్ చేయించిన పత్రాలు పోలీసులకు ఆమె ఇచ్చింది.

గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉండటం వల్ల తాను ఫిర్యాదు చేసేందుకు ధైర్యం చేయలేక పోయానని… ఇప్పుడు రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం రావటంతో ఫిర్యాదు చేశానని చాందిని తెలిపింది. రామనాథపురానికి చెందిన పరానీ అనే వ్యక్తి తనను చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె తన ఫిర్యాదులో వివరించింది. మలేషియా పౌరసత్వం కలిగిన చాందిని(36) ‘నడడిగల్​, వాగి సూడా వా’ సినిమా లాంటి తమిళ సినిమాల్లో నటించింది.

కాగా… మణికందన్ గతంలో అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఐటీ మంత్రిగా పని చేశారు. జయలలిత ఆప్తుడిగా పేరుపొందిన మణికందన్(41) అప్పటి మంత్రి ఉడుమలై రాధాకృష్ణన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పళని స్వామికి వ్యతిరేకంగా టీటీవీ దినకరన్ వేరు కుంపటిలో చేరి మంత్రి పదవి పోగొట్టుకున్నారు. చాందిని తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని… ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మాజీ మంత్రి మణికందన్ అన్నారు.