Coach Nagarajan Sexually Harassing : మసాజ్ పేరుతో మహిళా అధ్లెట్లతో వెకిలి చేష్టలు చేస్తున్న కోచ్

జాతీయ స్ధాయి మహిళా అథ్లెట్లను తయారు చేసిన తమిళనాడుకు చెందిన కోచ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఒకరు కాదు ఇద్దరూ కాదు ఏకంగా ఏడుగురు మహిళా అథ్లెట్లు అతనిపై ఫిర్యాదు చేశారు.

Coach Nagarajan Sexually Harassing : మసాజ్ పేరుతో మహిళా అధ్లెట్లతో వెకిలి చేష్టలు చేస్తున్న కోచ్

TN Coach Nagarajan

Coach Nagarajan Sexually Harassing : జాతీయ స్ధాయి మహిళా అథ్లెట్లను తయారు చేసిన తమిళనాడుకు చెందిన కోచ్ పై లైంగిక వేధింపుల కేసు నమోదయ్యింది. ఒకరు కాదు ఇద్దరూ కాదు ఏకంగా ఏడుగురు మహిళా అథ్లెట్లు అతనిపై ఫిర్యాదు చేయగా.. మరికొందరు ట్విట్టర్ వేదికగా కోచ్ వెధవ వేషాలపై గళం విప్పి పోలీసులను సంప్రదించారు.

తమిళనాడుకు చెందిన అథ్లెటిక్స్ కోచ్  పి.నాగరాజు పై ఓ జాతీయ స్థాయి మహిళా అథ్లెట్ (19),  లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఈ ఏడాది మే నెలలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మసాజ్ పేరుతో తమను తాకరాని చోట తాకుతూ పైశాచికత్వాన్ని ప్రదర్శించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. భయం కారణంగా ఇన్నాళ్లు అతనికి ఎదురు చెప్పలేకపోయానని చాలా సందర్భాల్లో అతను చేసే పనులకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందని తన ఫిర్యాదులో పేర్కోంది.

కేసు విచారించిన పోలీసులు నాగరాజు అరాచకాలపై పోక్సో చట్టంకింద కేసు నమోదు చేసి చార్జిషీట్ ఓపెన్ చేశారు. మొదటగా ఈవిషయాన్ని స్పోర్ట్స్ జర్నలిస్టు ముఖ్యమంత్రి సీఎం స్టాలిన్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. అనంతరం ఆ మహిళా కోచ్ ఫిర్యాదు చేసింది. మొదటి ఫిర్యాదు  రాగానే నాగరాజు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యా యత్నం చేశాడు. కానీ వెంటనే అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిచటంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

నాగరాజు లైంగిక వేధింపుల అంశం తెరపైకి వచ్చేసరికి మరో ఏడుగురు మహిళా అథ్లెట్లు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరంతా గతంలో నాగరాజు దగ్గర శిక్షణ తీసుకున్న వారు కాగా…మరి కొందరు జూనియర్లుగా ఉండి శిక్షణ పొందుతున్నవారు ఉన్నారు. చాలా సందర్భాలలో అందరు అమ్మాయిలను పంపించిన తర్వాత కొంతమందిని  ఉంచి వారికి ఫిజియోథెరపీ అందించే పేరుతో వారిని లైంగికంగా వేధించేవాడని ఒక బాధితురాలు వెల్లడించింది.

తనకు సహకరిస్తేనే అథ్లెటిక్స్ లో విజయం సాధించటానికి సహాయం చేస్తానని బెదిరించేవాడని బాధితులు చెప్పుకొచ్చారు. మరోక అథ్లెట్ తనకు 13 ఏళ్ల వయసులోనే నాగరాజు తనపై లైంగిక దాడి చేసినట్లు చెప్పుకొచ్చింది.  వీరు బాధలు  చెపుతుంటే పోలీసులు నివ్వెర పోతున్నారు. ఎంతో మంది జాతీయ స్థాయి అథ్లెట్లను తయారు చేసిన నాగరాజు ఇలాంటి దారుణాలకు పాల్పడ్డాడడని తెలిసి  నివ్వెర పోతున్నారు. అనేక మంది మాజీ అథ్లెట్లు నాగరాజు దురాగతాలను బయటపెట్టటానికి ముందుకు వస్తున్నారు. ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన బాలికలపై నాగరాజు  లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.