Gold Smuggling : 11 కిలోల బంగారాన్ని సముద్రంలో విసిరేసిన స్మగ్లర్లు, గాలించి, వెలికితీసి మరీ స్వాధీనం చేసుకున్న అధికారులు

సముద్రంలో విసిరేసిన 11కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇలా దాదాపు రూ.20 కోట్ల విలువైన 32.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Gold Smuggling : 11 కిలోల బంగారాన్ని సముద్రంలో విసిరేసిన స్మగ్లర్లు, గాలించి, వెలికితీసి మరీ స్వాధీనం చేసుకున్న అధికారులు

Gold Smuggling India - Sri Lanka  border

Gold Smuggling India – Sri Lanka  border : రైళ్లు,విమానాలు, రోడ్డు మార్గాలు,ఆఖరికి సముద్ర మర్గాల్లోకూడా బంగారం అక్రమ తరలింపులపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. విమానాశ్రయాల్లో ప్రతీరోజులు బంగారం తరలింపులను కష్టమ్స్ అధికారులు కనిపెట్టి పట్టుకుంటునే ఉన్నారు. ఈక్రమంలో తమిళనాడులో సముద్ర మార్గంలో రెండు పడవల్లో స్మగ్లర్లు అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నాకోస్ట్ గార్డులు.. అధికారులను చూసి స్మగ్లర్లు వెంటనే బంగారాన్ని సముద్రంలో విసిరేశారు. ఇకవారి తప్పించుకునే అవకాశం లేకపోవటంతో పట్టుబడ్డారు.

 

గత మంగళవారం (మే 30,2023) తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది. స్మగ్లర్లు రెండు పడవల్లో 11కిలోల బంగారాన్ని శ్రీలంక నుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా రామనాథపురం జిల్లాలోని మండపం చేపల రేవువద్ద ఒక్కసారిగా భారత కోస్టుగార్డులు ప్రత్యక్షమయ్యారు. దీంతో స్మగ్లర్లు షాక్ అయ్యారు. ఇక తమ పని అయిపోయిందనుకున్నారు. కానీ బంగారంతో మాత్రం పట్టుబడకూడదనుకున్నారు. అంతే అందరు ఆలోచించుకుని తమవద్ద ఉన్న 11 కేజీల బంగారాన్ని రామనాథపురం జిల్లాలోని మండపం చేపల రేవువద్ద సముద్రంలో విసిరేశారు. స్మగ్లర్ల పన్నాగం అర్థం అయిన అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Shamshabad Airport : బ్యాటరీలో మూడు కిలోల బంగారం .. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఏపీ వ్యక్తి అరెస్ట్

అనంతరం భారత కోస్టుగార్డులు, డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌, కస్టమ్స్‌ సిబ్బంది కలిసి బంగారం కోసం రెండు రోజుల పాటు నిర్విరామంగా సముద్రంలో గాలించారు. ఎట్టకేలకు పట్టుకున్నారు. 11కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ.20.2 కోట్ల నుంచి రూ.32 కోట్లకు పైనే ఉంటుందని అంచనావేశారు. అలాగే వడలైవద్ద మరో పడవలో 21.2 కిలోల బంగారాన్ని గుర్తించి అధికారులు పట్టుకున్నారు. ఇలా దాదాపు రూ.20 కోట్ల విలువైన 32.6 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని డీఆర్‌ఐ వెల్లడించింది.

 

కాగా కోస్టుగార్డులు,డీఆర్ఐ సంయుక్తంగా భారతదేశం-శ్రీలంక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) సమీపంలో ఫిషింగ్ ఓడలపై నిఘాపెట్టారు.ఈక్రమంలోనే వారి ప్రయత్నాలు ఫలించాయి. రామనాథపురం జిల్లా మండపం ఫిషింగ్ హార్డర్ వద్ద అనుమానాస్పదంగా వస్తున్న రెండు పడవలను గుర్తించారు. అధికారులను చూసిన స్మగ్లర్లు బంగారాన్ని సముద్రంలో విసిరేయటంతో దాన్ని గాలించి మరీ స్వాధీనంచేసుకున్నారు.