ఉలిక్కిపడిన తమిళనాడు : ఆన్ లైన్ లాటరీ చిచ్చు..9 మంది ఆత్మహత్య

  • Published By: madhu ,Published On : December 13, 2019 / 10:24 AM IST
ఉలిక్కిపడిన తమిళనాడు : ఆన్ లైన్ లాటరీ చిచ్చు..9 మంది ఆత్మహత్య

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ లాటరీ.. 9 మందిని బలి తీసుకుంది. ఆన్‌‌లైన్ లాటరీలో మోసపోవడంతో.. రెండు కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. విల్లుపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సూసైడ్ చేసుకున్నారు. కొడైకెనాల్ రైల్వే స్టేషన్ దగ్గర నలుగురు సభ్యులున్న మరో కుటుంబం రైలు కింద పడి సూసైడ్ చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఓ కుటుంబం.. సెల్ఫీ వీడియో తీసుకుంది.

లాటరీలో డబ్బులు కోల్పోయి.. అప్పుల బాధ భరించలేక.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించలేక.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియోలో చెప్పారు. తమలా ఎవరూ మోసపోవద్దని అందులో తెలిపారు. ఒకే రోజు 9 మంది చనిపోవడంతో తమిళనాడు పోలీసులు అలర్టయ్యారు. ఆన్‌లైన్ లాటరీ వ్యాపారం చేస్తున్న వారిపై ఆకస్మిక దాడులు చేశారు. ఇప్పటివరకు 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనతో.. తమిళనాడు ఉలిక్కిపడింది. 

తమిళనాడులోని విల్లుపురంలో సితేరికరై ప్రాంతంలో నివాసం ఉంటున్న అరుణ్ (33) వ్యాపారం చేస్తూ..కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య..ముగ్గురు పిల్లలున్నారు. వ్యాపారంలో నష్టం రావడంతో..అక్రమంగా నిర్వహిస్తున్న లాటరీలు కొనుగోలు చేశాడు. కానీ మోస పోయానని గ్రహించడంతో కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ముగ్గురు పిల్లలకు సైనేడ్ ఇచ్చి..భార్య..భర్తలిద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు..అరుణ్ తీసిన వీడియో అందరినీ కంటతడిపెట్టేస్తోంది. 
Read More :నిర్భయ హంతకులకు ఉరి ఎప్పుడు?: చట్టం ఏం చెబుతోంది