Tamil Nadu : కోర్టులోనే భార్యపై యాసిడ్ పోసిన భర్త..

భార్యపై పగ పెంచుకున్న ఓ భర్త కోర్టులోనే అందరిముందే భార్యపై యాసిడ్ పోసిన ఘటన తమిళనాడులో కలకలం సృష్టించింది.

Tamil Nadu : కోర్టులోనే భార్యపై యాసిడ్ పోసిన భర్త..

Man attacked wife with acid in court

Tamil Nadu : తమిళనాడులోని కోయంబత్తూరు కోర్టులోనే ఓ వ్యక్తి తన భార్యపై యాసిడ్ పోసాడు.భార్యపై యాసిడ్ పోసి పారిపోతున్న వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు. తనను వదిలేసి ప్రియుడిపై వెళ్లిపోయిన భార్యపై పగ పెంచుకున్న శివకుమార్ అనే వ్యక్తి ఈ యాసిడ్ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు తెలిపారు. ప్రియుడితో వెళ్లిపోయిన భార్యపై శివకుమార్ పగతో రగిలిపోయాడు. దీంతో గురువారం (మార్చి23,2023) కోయంబత్తూరు కోర్టుకు ఇద్దరు హాజరయ్యారు. ఈక్రమంలో భార్యపై ఆగ్రహంతో రగిలిపోతున్న శివకుమార్ కూడా యాసిడ్ బాటిల్ ని ఓపెన్ చేసి అందరు చూస్తుండగానే భార్యపై పోశాడు. ఊహించని ఈఘటనతో వెంటనే తేరుకున్న పోలీసులు ఆమెను హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. 80శాతం కాలిపోయిందని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.

లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న 40 ఏళ్ల శివకుమార్ తన భార్యతో కలిసి సూలూరు సమీపంలోని కన్నంపాళయంలోని మహాలక్ష్మీ నగరంలో నివాసించేవారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. శివకుమార్ భార్యకు ఓ వ్యక్తితో పరిచయం అయ్యింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధంగా మారింది. ఈక్రమంలో భర్తను..ఇద్దరు కుమార్తెలను వదిలేసి ఆమె ప్రియుడితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో స్థానికంగా శివకుమార్ కు ఎన్నో అవమానాలు ఎదురయ్యాయి. ఓ పక్క భార్య చేసిన మోసం..మరో పక్క ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు ఇరుగు పొరుగువారు చూసే హేళన చూపులు వెరసి శివకుమార్ కు భార్యపై పగ పెంచుకున్నాడు. కనిపిస్తే చంపేయాలన్నంత కోపం పెంచుకున్నాడు.

ఈక్రమంలో 2016లో ఓ చోరీ కేసులో శివకుమార్ భార్య అరెస్ట్ అయ్యింది. ప్రస్తుతం బెయిలుపై బయట ఉంది. ఈ కేసు విచారణకు ఆమె వస్తుందని తెలుసుకున్న శివకుమార్ అతను కూడా కోర్టుకు వచ్చాడు. వస్తూ వస్తూ కూడా యాసిడ్ క్యాన్ తెచ్చుకున్నాడు. కేసు విచారణ కోసం గురువారం ఆమె కోర్టుకు రావటంతో అదను చూసి శివకుమార్ కోర్టు ఆవరణలోనే ఆమెపై యాసిడ్ పోసాడు. ముఖం,శరీరంపై యాసిడ్ పడటంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయింది. తరువాత పారిపోవటానియి యత్నించగా అక్కడే ఉన్న పోలీసులు శివకుమార్ ను పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడిలో ఆమెకు 80 శాతం గాయాలయ్యాయని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు.