Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి

తమిళనాడులోని ఒక నాగదేవత ఆలయంలో పాము భక్తుడి నాలుకపై కాటేసింది. నాలుక బయటపెట్టి పూజలు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. నిత్యం పాము కలలోకి వస్తుండటంతో భక్తుడు ఈ పూజలు నిర్వహించాడు.

Tamil Nadu: పాముకు పూజలు చేస్తుండగా నాలుకపై కాటేసిన పాము.. భక్తుడి నాలుక కోసేసిన పూజారి

Tamil Nadu: తమిళనాడులోని ఈరోడ్‌లో దారుణం జరిగింది. ఒక నాగ దేవతకు సంబంధించిన గుడిలో పూజలు నిర్వహిస్తుండగా భక్తుడిని పాము కాటేసింది. ఈ ఘటనలో అతడి నాలుకను కోసేశాడు పూజారి. ఈరోడ్ ప్రాంతం, కొపిచెట్టిపాలయం గ్రామానికి చెందిన రాజా అనే వ్యక్తికి నిత్యం పాము గురించిన కలలు వచ్చేవి.

Afghanistan: అఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల అనాగరిక పాలన.. గే సెక్స్, వ్యభిచారం చేసినందుకు కొరడా దెబ్బలు

తరచూ పాము కాటేసినట్లు కలలు వచ్చేవి. దీంతో ఈ విషయంపై జ్యోతిష్యుడిని సంప్రదించాడు. ఈ సమస్య పరిష్కారానికి అతడు ఒక సలహా ఇచ్చాడు. పాముల్ని పూజించే స్థానిక నాగ దేవత గుడికి వెళ్లి కొన్ని పూజలు చేయాలని సూచించాడు. దీంతో రాజు ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లే సమీపంలోని ఒక నాగదేవత గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ పాము ఎదురుగా ఏదో తంతు చేయబోయి నాలుక బయటపెట్టాడు. ఇలా విషం ఉన్న పాము ఎదురుగా మూడు సార్లు నాలుక బయటపెట్టేందుకు ప్రయత్నించాడు.

PSLV C-54: పీఎస్‌ఎల్‌వీ-సీ54 ప్రయోగం సక్సెస్.. తొమ్మిది ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్

ఈ క్రమంలో పాము వెంటనే అతడి నాలుకపై కాటేసింది. ఇది గమనించిన పూజారి అతడిని రక్షించేందుకు నాలుక కోసేశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో అతడు స్పృహ కోల్పోయాడు. తర్వాత పూజారి స్థానికుల సాయంతో అతడిని దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి ప్రస్తుతం చికిత్స అందుతోంది. అతడికి విషానికి విరుగుడు ఇంజక్షన్ ఇచ్చి చికిత్స చేస్తున్నారు.