Youtubeలో చూస్తూ గర్ల్‌ఫ్రెండ్‌కు డెలీవరీ.. శిశువు మృతి, తల్లి పరిస్థితి విషమం

Youtubeలో చూస్తూ గర్ల్‌ఫ్రెండ్‌కు డెలీవరీ.. శిశువు మృతి, తల్లి పరిస్థితి విషమం

19ఏళ్ల యువతికి యూ ట్యూబ్‌లో చూస్తూ డెలీవరి చేయబోయాడు బాయ్ ఫ్రెండ్.. ఈ సీక్రెట్ ఆపరేషన్ లో శిశువు మృతి చెందగా తల్లి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. యూట్యూబ్‌లో వీడియోలు చూసి డెలివరీ చేయాలనుకున్నాడు. గ్యాస్ సిలెండర్ డెలివరీ చేసే 27ఏళ్ల వ్యక్తికి 19ఏళ్ల  యువతికి లవ్ అఫైర్ ఉంది. 

కొన్నేళ్లుగా ఉన్న వారి రిలేషన్‌లో యువతి గర్భం దాల్చింది. తమిళనాడులోని పొన్నేరి ప్రాంతంలో ఉంటున్నారు. 8నెలల గర్భిణీ కావడంతో పురిటినొప్పులు మొదలయ్యాయని బాయ్ ఫ్రెండ్‌కు చెప్పింది. దీంతో ఆ వ్యక్తి సర్జికల్ గ్లౌజులు, బ్లేడులు కొనుక్కొని బైక్‌పైన మహిళను ఎక్కించుకుని పొలాల వైపుకు తీసుకెళ్లాడు. 

చెన్నై శివారు ప్రాంతానికి సమీపించిన తర్వాత.. యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ ప్రసవం చేయబోయాడు. ముందుగా శిశువు చేయి బయటకు వచ్చేసరికి కంగారుపడ్డాడు. సాధారణంగా తాను చూసిన వీడియోల్లో తల బయటకు వస్తుంది కానీ చేతులు కాదని.. తెలిసి తల కోసం చెయ్యిని పట్టుకుని బలంగా లాగాడు. 

శిశువు చెయ్యి విరిగిపోయింది. ఆ క్షణంలో యువతి తీవ్ర రక్తస్రావం కావడం మొదలైంది. యువతి ప్రాణాలు పోతాయని భయపడి బైక్ పై ఎక్కించుకుని 12కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నేరి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. వారిద్దరినీ చూసి డాక్టర్లు షాక్ అయ్యారు. ప్రథమ చికిత్స చేసి యువతిని రోయపురంలోని RSRM మెటర్నిటీ హాస్పిటల్‌కు తరలించారు. 

అక్కడ చికిత్స చేసిన డాక్టర్లు మగశిశువును బయటకు తీశారు. బాగా రక్తం పోవడంతో మహిళ పరిస్థితి విషమంగా తయారైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని చెంపదెబ్బలతో స్టేషన్ కు తీసుకెళ్లి మర్డర్ కేసు నమోదు చేశారు. ఇరు కుటుంబాలను పిలిపించి ఇన్నాళ్లుగా ప్రెగ్నెన్సీ గురించి తెలియకుండా దాచిన ఘటనపై విచారణ జరుపుతున్నారు. 

Also Read | నేను చేసిన తప్పేంటి.. నిస్పృహతో సీఎం పదవికి కమల్‌నాథ్ రాజీనామా