Sexual Assault : ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళపై లైంగిక దాడి చేసిన ఎస్సై

రెండో భర్తపై ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళకు న్యాయం చేస్తానని మాయమాటలు చెప్పి ఆమహిళపై లైంగికదాడి చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

Sexual Assault : ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళపై లైంగిక దాడి చేసిన ఎస్సై

Tamilnadu Si Sexual Abuse

Sexual Assault :  రెండో భర్తపై ఫిర్యాదు చేయటానికి వచ్చిన మహిళకు న్యాయం చేస్తానని మాయమాటలు చెప్పి ఆమహిళపై లైంగికదాడి చేసిన సబ్ ఇన్‌స్పెక్టర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

కన్యాకుమారి జిల్లా కళియకొవిల్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ ప్రాంతానికి చెందిన మహిళకు (32) పెళ్లై 9 ఏళ్ల కూతురు ఉంది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న ఆమె మరోక వ్యక్తిని ప్రేమించి రెండో వివాహం చేసుకుంది.  అతను కూడా మోసం చేయటంతో  రెండో భర్తపై  ఫిర్యాదు చేయటానికి పళుగల్ పోలీసు స్టేషన్‌కు వెళ్లింది.

ఆ సమయంలో అక్కడ డ్యూటీలో ఉన్న  సబ్ఇన్‌స్పెక్టర్ సుందరలింగం ఆమెకు సహాయం చేస్తున్నట్లు భ్రమ కల్పించి ఆమెకు దగ్గరయ్యాడు. విచారణ పేరుతో తరచూ ఆమె ఇంటికి రాకపోకలు సాగించాడు. ఆమెను వివిధ ప్రదేశాల్లో తిప్పుతూ ఆమెపై సన్నిహితంగా మెలిగాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది.

Also Read : Bike e-Challan : చలానాలు కట్టే బదులు కొత్త బండి కొనుక్కోవచ్చు.. బైక్ వదిలి పరార్

ఈ విషయం సుందరలింగంకు చెప్పగా అబార్షన్ చేయించుకోమని సలహా చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఇన్‌స్పెక్టర్ ఆమెను వైద్య పరీక్షల పేరుతో పులియరంగిలోని  డాక్టర్ కార్మల్‌రాణి  ఆస్పత్రిలో చేర్పించి అబార్షన్ చేయించాడు. ఈ‌ఘటనతో ఎస్సై తనను మోసం చేసాడని గ్రహించిన మహిళ పలుమార్లు కకళియకోవిల్, మార్తాండం పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు కేసు నమోదు చేసుకోలేదు.

డీఎస్పీ,ఎస్పీ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసింది. అయినా ఎవరూ పట్టించుకోలేదు. ఆమెకు న్యాయం జరగలేదు. ఈ నేపధ్యంలో ఆమె కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి,  సబ్‌ఇన్‌స్పెక్టర్ సుందరలింగం..అతనికి సహకరించిన గణేష్ కుమార్, మార్తాండానికి చెందిన అభిషేక్, తిరువట్టార్ కు చెందిన కార్మల్ రాణి, దేవరాజ్ తదితర ఎనిమిది మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రధాన నిందితుడు సుందరలింగం ప్రస్తుతం తేని జిల్లాలో ఎస్సై గా పని చేస్తున్నాడు. మార్తాండం మహిళా పోలీసు స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.