ఆడోళ్ల మధ్య గొడవ – ముక్కు కొరికేసిన మహిళ

ఆడోళ్ల మధ్య గొడవ – ముక్కు కొరికేసిన మహిళ

tamil woman bitten off neighbour woman”s nose during fight : ఇద్దరు మహిళల మధ్య జరిగిన గొడవలో ఒక మహిళ మరోక మహిళ ముక్కు కొరికేసిన ఘటన తమిళనాడులో జరిగింది. వాల్పరై పోలీసు స్టేషన్ పరిధిలోని స్టాన్మూర్ ఎస్టేట్ వంతెన సమీపంలో ఇద్దరు ఇరుగు పొరుగు మహిళల మధ్య జరిగిన గొడవలో ఒక మహిళ మరోక మహిళ ముక్కు కొరికింది.

రేవతి, తంగమ్మాళ్ అనే మహిళలు ఇద్దరూ పక్క పక్కన ఇళ్ళల్లో నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. అదే విధంగా శనివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో తంగమ్మాళ్ కుమార్తె,తన తల్లితో గొడవపడుతున్న రేవతి(55) ముక్కు కొరికింది.

దీంతో ఆమెకు తీవ్రగాయమయ్యి, రక్తస్రావం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి తంగమ్మాళ్ కుమార్తెలు లక్ష్మి. వత్సల పై కేసు నమోదు చేసి రేవతిని ఆస్పత్రికి తరలించారు.