నువ్వు నాకు నచ్చావ్..ఎంజాయ్ చేద్దాంరా..అంటూ మనుమరాలి ఫ్రెండ్ కి 66ఏళ్ల తాత లెటర్

  • Published By: nagamani ,Published On : June 26, 2020 / 06:58 AM IST
నువ్వు నాకు నచ్చావ్..ఎంజాయ్ చేద్దాంరా..అంటూ మనుమరాలి ఫ్రెండ్ కి 66ఏళ్ల తాత  లెటర్

ముసలోడికి దసరా పండుగ అన్నట్లుగా బాలికపై 66 ఏళ్ల ముసలోడు రెచ్చిపోయాడు. 16 ఏళ్ల బాలికకు లవ్ లెటర్ ఇచ్చాడు.ఆ లెటర్ లో వికారపు రాతలన్నీ రాశాడు. I like You, I love U, I Kiss You, నువ్వు నాకు చాలా చాలానచ్చేశావ్..నువ్వంటే నాకు ఎంతో ఇష్టం..నిన్ను ముద్దు పెట్టుకోవాలని తహతహలాడిపోతున్నా..నీక్కూడా ఇష్టమేనా..విషయం ఎవ్వరికీ చెప్పకూడదు..ఇంట్లో ఎవ్వరూ లేని టైమ్ కోసం ఎదురు చూస్తున్నా..నీకు అప్పుడు కబురు చేస్తాను..వచ్చేయ్..ఇద్దరం చక్కగా ఎంజాయ్ చేద్దాం అంటూ మనువరాలి ఫ్రెండ్ కు 66 ఏళ్ల తాత లవ్ లెటర్ రాశాడు.

ఈ విషయం ఆ బాలిక తల్లికి చెప్పింది. అంతే..అపరకాళిలా ముసలాడిపై విరుచుకుపడింది.  కాటికి కాలు చాపే వయసులో నీకిందేం పోయేకాలంరా.. అంటూ తిట్టిపోయింది. నాకూతురు జోలికే కాదు..ఇంకే ఆడపిల్ల జోలికి వెళ్లినా నిన్ను తగలేస్తాం జాగ్రత్త అంటూ ఎత్తిపోయింది. అంతటితో ఊరుకుంటే..లాభం లేదనుకున్నారు. వీడిని ఇలాగే వదిలేస్తే అమ్మాయిల జీవితాలు నాశనం చేసేలా ఉన్నాడు వీడి తీరు చూస్తే…అనుకుని అమ్మాయి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

తమిళనాడులోని కోయంబత్తూరు లోని ఫోథానూర్ సమీపంలోని బాబాజీ మసీదు సమీపంలో మహమ్మద్ పీర్ పాష అనే 66ఏళ్ల వృద్దుడు నివాసం ఉంటున్నాడు. మహమ్మద్ పీర్ పాషాకు కూతుళ్లు..కొడుకులు వారందరికీ  పెళ్లిళ్లు కూడా అయిపోయాయి. వీరంతా తండ్రి ఉంటున్న ప్రాంతంలోనే ఉంటుండగా..ఓ కొడుకు..కోడలు..మనుమలు భార్యతో కలిసి ఉంటున్నాడు ఈ ముసలోడు. 

కానీ 66 ఏళ్ల వయసులో మహమ్మద్ పిచ్చి పనులు మానలేదు.లాక్ డౌన్ తో స్కూల్స్ మూసివేయడంతో మహమ్మద్ మనుమలతో కలిసి అతని స్నేహితులు కూడా తాత దగ్గరే ఆడుకుంటున్నారు. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న 16 ఏళ్ల బాలిక  ఆడుకోవడానికి మనుమరాలి ఫ్రెండ్ అయిన ఓ బాలికపై తాత కన్ను పడింది. తాతా తాతా అంటూ ఆడుకుంటున్న ఆ చిన్నారితో వికారపు చేష్టలకు దిగాడు ముసలోడు. అప్పుడే ఎదుగుతున్న ఆమె శరీరంపై ఎక్కడపడితే అక్కడ చేతులు వెయ్యడం, అసభ్యంగా ప్రవర్తించడం చేసేవాడు. ఓ రోజు పిచ్చి రాతలు రాసి లవ్ లెటర్ కూడా ఇచ్చాడు.మనుమరాలితో కలిసి కావాలని ఆ బాలిక ఇంటికి వెళ్లేవాడు. ఆ పెద్దవయస్సున్న మహమ్మద్ పీర్ పాషాపై ఎవ్వరికీ అనుమానం రాలేదు. దాన్ని అదనుగా తీసుకున్నముసలోడు పిచ్చి చేష్టలకు పాల్పడ్డాడు.

 I Love You బంగారం I like You, I love U, I Kiss You, నువ్వు అంటే నాకేంతో ఇష్టం ఈ విషయం ఎవ్వరికీ చెప్పకూడదు..ఇంట్లో ఎవ్వరూ లేని టైమ్ లో నీకు కబురు చేస్తా వచ్చేయ్..ఇద్దరం ఎంచక్కా ఎంజాయ్ చేద్దాం.. అంటూ రాశాడు. అది చూసిన ఆ బాలిక షాక్ అయ్యింది. 

తాతా నువ్వు చేసిన పని ఏమీ బాగాలేదని 16 ఏళ్ల బాలిక 66ఏళ్ల మహమ్మద్ పీర్ పాషాపై మండిపడింది. ఈ విషయం బయటకు చెబితే నిన్ను చంపేస్తానని మహమ్మద్ పీర్ పాషా బాలికను బెదిరించాడు. అయితే లవ్ లెటర్ తీసుకెళ్లి ఆ బాలిక నేరుగా ఆమె తల్లికి ఇచ్చింది. ఒక్కరోజు ఆలోచించిన తల్లి మహమ్మద్ పీర్ పాషాను ఇలాగే వదిలేస్తే..ఇంకా ఎంతమందితో ఆడుకుంటాడోనని భావించి పోలీసులకు సమాచారం ఇచ్చింది.

ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు మహమ్మద్ పీర్ పాషాకు బెండ్ తీశారు. దీంతో తానే లవ్ లెటర్ రాశానని మహమ్మద్ పీర్ షాషా ఒప్పుకున్నాడు.  దీంతో అతనిపై కేసు నమోదు చేసి..కోవై సెంట్రల్ జైలుకు తరలించామని కోయంబత్తూరు పోలీసు అధికారులు తెలిపారు.

Read: బావతో అక్రమ సంబంధం… భర్త హత్య