Illegal Affair : పెళ్లి కాకుండానే గర్భం ధరించిన టీచర్… ఇంట్లో ప్రసవం చేయటంతో…

తమ్ముడు వరసయ్యే యువకుడితో సన్నిహితంగా మెలిగి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గర్భం ధరించింది.  9 నెలలు గుట్టుగా గర్భాన్ని మోసింది. ఆమె కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ప్రసవ సమయంలో ఆమె మరణించగా పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేశారు.

Illegal Affair : పెళ్లి కాకుండానే గర్భం ధరించిన టీచర్… ఇంట్లో ప్రసవం చేయటంతో…

Tamilnadu Private Teacher Died

private teacher-died, she givenby baby-birth due to illegal affair : తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమ్ముడు వరసయ్యే యువకుడితో సన్నిహితంగా మెలిగి ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ గర్భం ధరించింది.  9 నెలలు గుట్టుగా గర్భాన్ని మోసింది. ఆమె కుటుంబీకులు ఇంట్లోనే ప్రసవం చేశారు. ప్రసవ సమయంలో ఆమె మరణించగా పుట్టిన పసికందును చెత్త కుప్పలో పడేశారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగుచూడటంతో పోలీసులు టీచర్ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసారు.

దిండుగల్ జిల్లా పళని సమీపంలోని ఆరుకుడికి చెందిన మణియన్ కుమార్తె మంగయకరసి(29) ప్రవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తోంది. గతేడాది నుంచి కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ తో స్కూళ్లు మూత పడ్డాయి. అప్పటి నుంచి ఇంటివద్దే ఉండి విద్యార్ధులకు ఆన్ లైన్ లో క్లాసులు భోదిస్తోంది.

ఈ సమయంలో వారింట్లో ఉంటున్న సమీప బంధువైన యువకుడికి మంగయకరసి దగ్గరైంది. ఇద్దరూ చనువుగా ఉండసాగారు. ఇద్దరూ చనువుగా ఉంటున్నారని తెలిసినా ఇంట్లోని వారు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే ఆ యువకుడు మంగయకరసి కి తమ్ముడు వరస కావడమే. వీరి చనువు హద్దులు దాటి సన్నిహితంగా మెలిగారు. ఫలితంగా మంగయకరసి గర్భం దాల్చింది.

డాక్టర్లకు చూపించగా అబార్షన్ చేయలేమని చెప్పడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. వరసకు తమ్ముడి వరసయ్యే వ్యక్తితో గర్భం దాల్చిందని తెలిస్తే కుటుంబ పరువు పోతుందని మనో వేదనకు గురయ్యారు. ఆమెను ఇల్లు కదలనీయకుండా ఇంట్లోనే ఉంచారు. తొమ్మిది నెలలు నిండాక ఆమెకు కొద్దిరోజులక్రితం పురిట నొప్పులు ప్రారంభమయ్యాయి. కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఆమెకు ప్రసవం చేశారు. మగబిడ్డకు ఆమె జన్మనిచ్చింది.

ప్రసవం సమయంలో తీవ్రరక్తస్రావంకావటంతో మంగయకరసి అపస్మారక స్ధితిలోకి వెళ్లడంతో ఆమెను ఆస్పత్రికి తరలించి… అప్పుడే పుట్టిన పసికందును చెత్తకుప్పలో పడేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ…. ఆస్పత్రిలో చేర్చిన మంగయకరసి మరణించటం… ఆఘ మేఘాల మీద అంత్యక్రియలు జరగటం ఇరుగుపొరుగువారిలో అనుమానాలు రేకెత్తించాయి.

సమచారం పోలీసులకు చేరింది. మంగయకరసి ఇంటికి వచ్చిన పోలీసులు..ఇంట్లోనే ప్రసవం చేసిన ఆమె తల్లి తంగం,సోదరి గణేషప్రియ, తమ్ముడు కాళిదాసులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే, ఆమె గర్భానికి కారకుడైన ప్రియుడు అదిష్‌కుమార్‌ను కూడా అరెస్టు చేశారు. అయితే, చెత్తకుండీలో బిడ్డను పడేసిన సమయంలో ప్రాణాలతో ఉన్నట్టుగా కాళిదాసు పేర్కొనడంతో ఆ పసిబిడ్డ జాడ కోసం పోలీసులు అన్వేషణ సాగిస్తున్నారు. ఎవరికైనా ఆ బిడ్డ దొరికిందా లేదా మరణించిందా అని ఆరా తీస్తున్నారు.