Woman Rescued: కోడలిని భూత వైద్యుడికి అప్పగించిన అత్తింటి వారు: మహిళపై 80 రోజులుగా అఘాయిత్యం

మహిళను ఒక గదిలో బంధించిన ఎస్‌కే తరాఫ్..ఆమె పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇలా దాదాపు 80 రోజుల పాటు భూత వైద్యుడు మహిళపై దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు

Woman Rescued: కోడలిని భూత వైద్యుడికి అప్పగించిన అత్తింటి వారు: మహిళపై 80 రోజులుగా అఘాయిత్యం

Odisha

Woman Rescued: దేశంలో మహిళలపై అఘాయిత్యాలు నానాటికి పెరిగిపోతున్నాయి. పోలీసు కేసుల సమయంలో బయటకు వచినవే కొన్నైతే..బయటకు చెప్పుకోలేక లోలోపల క్రుంగిపోతున్నవారు కొందరు. వైవాహిక జీవితంలో విబేధాలు పరిష్కరించాలంటూ ఓ వివాహితను సాక్షాత్తు అత్తింటివారే..భూతవైద్యుడికి అప్పగించగా..సదరు మహిళపై ఆ భూత వైద్యుడు 80 రోజులుగా అత్యాచారానికి పాల్పడిన ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పోలీసు కేసు నేపథ్యంలో ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని జలేశ్వర్ పోలీసుల కథనం ప్రకారం..మయూర్‌భంజ్ జిల్లాలోని బైంచ్‌డిహా గ్రామానికి చెందిన మహిళకు 2017లో అదే గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. వారికీ రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.

Also read:Bangkok: భార్య మృతదేహంతో 21ఏళ్లుగా సహజీవనం.. రాత్రిళ్లు శవపేటిక వద్ద కబుర్లు..

ఈక్రమంలో గత కొన్ని రోజులుగా మహిళకు అత్తింటి నుంచి వేధింపులు ఎదురయ్యాయి. ఇదే విషయాన్ని భర్త వద్ద ప్రస్తావించినా..ఆతను పెడచెవిన పెట్టాడు. అయితే మూడు నెలల క్రితం భర్త..వ్యాపార నిమిత్తం పొరుగు గ్రామానికి వెళ్లగా..అత్తమామలు మహిళను ఒక భూతవైద్యుడి వద్దకు తీసుకువెళ్లారు. భూతవైద్యుడు ఎస్‌కే తరాఫ్ మహిళను పరీక్షించి కొన్ని రోజులు తన వద్దనే ఉంచితే నయం చేసి పంపిస్తానంటూ నమ్మబలికాడు. అనంతరం మహిళను ఒక గదిలో బంధించిన ఎస్‌కే తరాఫ్..ఆమె పై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఇలా దాదాపు 80 రోజుల పాటు భూత వైద్యుడు మహిళపై దారుణ అత్యాచారానికి పాల్పడ్డాడు. మహిళ గదిలో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోగా కనీసం..బయటి ప్రపంచంతో సంబంధం కూడా లేకుండా పోయింది.

Also read:NFH Survey: భారత్‌లో 30% మంది మహిళలకు శారీరక, లైంగిక హింస.. 80శాతం కేసుల్లో భర్తే నేరస్తుడట

అయితే రెండు రోజుల క్రితం(శుక్రవారం) భూతవైద్యుడు ఎస్‌కే తరాఫ్ ద్రుష్టి మళ్లించి అతని ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూతవైద్యుడు ఎస్‌కే తరాఫ్, మహిళ అత్తమామలు, మరిది, భర్తపైనా జలేశ్వర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహ జీవితంలో తలెత్తిన చిన్నపాటి విబేధాలు పరిష్కరించాలంటూ తనను తమ అత్తమామలు భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారని మహిళ పోలీసులకు తెలిపింది.

Also Read:Two Girls Love: యువతుల మధ్య ప్రేమ.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన జంట!