విశాఖలో రేవ్ పార్టీ : TDP నాయకుడు కుమారుడే నిర్వాహకుడు? 

  • Published By: chvmurthy ,Published On : April 14, 2019 / 03:28 PM IST
విశాఖలో రేవ్ పార్టీ : TDP నాయకుడు కుమారుడే నిర్వాహకుడు? 

విశాఖపట్నం: ఎన్నికలయ్యాయి…. రిలాక్స్ అవుదామనుకున్నారో ఏమో కొంత  మంది యువతీ యువకులు శనివారం రాత్రి విశాఖలో రేవ్ పార్టీ నిర్వహించుకున్నారు. బీచ్‌ రోడ్‌లో శనివారం అర్థరాత్రి  జరిగిన రేవ్ పార్టీ కలకలం రేపింది. ఓ హోటల్ పరిసరాల్లో రహస్యంగా నిర్వహించిన ఈ పార్టీలో… మద్యం, గంజాయి మత్తులో అమ్మాయిలు, అబ్బాయిలు ఊగిపోయారు. అర్థరాత్రి నుంచి తెల్లవార్లు మ్యూజిక్ హోరుతో యువత మత్తులో జోగారు. పోలీసులకు స్థానికులు సమాచారం ఇవ్వడంతో  వచ్చిన పోలీసులు… నిర్వాహకుల లాబీయింగ్‌తో వెనుదిరిగారు. అయితే ఇందులో టీడీపీ నేత కుమారుడి పాత్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.