ఎనిమిదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

  • Published By: veegamteam ,Published On : December 16, 2019 / 01:28 PM IST
ఎనిమిదో తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయుడు

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు దుశ్చర్యకు పూనుకున్నాడు. 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిడదవోలు మండలం తాడిమళ్లలోని ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థినిపై తెలుగు ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలిక బంధువులు ఆరోపించారు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు.. ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేశారు. 

తాడిమళ్ల ప్రభుత్వ పాఠశాలలో కోయ లక్ష్మయ్య అనే యువకుడు తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అదే పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే గేమ్స్ లో సెలెక్ట్ చేయను, పరీక్షల్లో మార్కులు తక్కువగా వేస్తానని బెదిరించినట్లు బాధిత బాలిక చెబుతోంది. అయితే ఈ విషయాన్ని రెండు రోజుల క్రితం బాలిక తన అమ్మమ్మకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

దీంతో బాలిక బంధువులు పాఠశాల దగ్గర ఆందోళనకు దిగారు. ఉపాధ్యాయుడిని తమకు అప్పగించాలని యువకులు, బంధువులు ధర్నాకు దిగారు. టీచర్ కు మద్దతుగా మరో వర్గం రంగంలోకి దిగింది. కొంతమంది పాఠశాల దగ్గరకు చేరుకున్నారు. అయితే ఉపాధ్యాయుడు మంచివాడని వాధిస్తున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

దీంతో నిడదవోలు సీఐ స్వామి, రూరల్ ఎస్ ఐ సురేష్ పాఠశాల వద్దకు చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. అలాగే లక్ష్మయ్యను పోలీస్ స్టేషన్ కు తరలించారు. బాలిక తండ్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.