ఐరన్‌ స్కేల్‌తో విద్యార్థి తలపై కొట్టిన టీచర్‌ 

హైదరాబాద్ లో ఓ టీచర్‌.. ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్‌ స్కేల్‌తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

  • Published By: veegamteam ,Published On : January 22, 2020 / 12:02 AM IST
ఐరన్‌ స్కేల్‌తో విద్యార్థి తలపై కొట్టిన టీచర్‌ 

హైదరాబాద్ లో ఓ టీచర్‌.. ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్‌ స్కేల్‌తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది.

హైదరాబాద్ లో ఓ టీచర్‌.. ఏడో తరగతి విద్యార్థి తలపై ఐరన్‌ స్కేల్‌తో కొట్టడంతో గాయమైంది. ఈ విషయంపై ఆ స్కూల్‌ ప్రిన్సిపల్‌కు చెప్పి నా పట్టించుకోకపోవడంతో ఇది కాస్తా పోలీస్‌స్టేషన్‌కు చేరింది. పోలీసులు ఫిర్యాదు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించారు. వివరాళ్లోకి వెళ్తే… హెచ్‌బీకాలనీలో నివాసముండే భార్గవి కుమారుడు నిఖిల్‌సాయి ఈసీఐఎల్‌లోని యస్‌ఆర్‌ డీజీ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్నాడు. 

ఈ క్రమంలోనే సోమవారం (జనవరి 20, 2020) టీచర్‌ శశికళ క్లాస్‌ తీసుకునేందుకు ఏడో తరగతి గదికి వెళ్లారు. అల్లరి చేస్తున్న విద్యార్థులను వారిస్తున్న క్రమంలో ఐరన్‌ స్కేల్‌తో నిఖిల్‌సాయి తలపై కొట్టారు. దీంతో బాలుడి తలకు గాయమై రక్తస్రావం అయింది. జరిగిన విషయాన్ని బాలుడు తల్లిదండ్రులకు చెప్పాడు. బాలుడి తల్లి భార్గవి ప్రిన్సిపల్‌ను నిలదీయగా..ఆయన నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో బాలుడి తాతయ్య దయానంద్‌తో కలిసి ఆమె కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు కేసు నమోదు చేయకుండా 5 గంటలు స్టేషన్‌లోనే ఉంచారు.

రాత్రి 11 గంటల సమయంలో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో మంగళవారం (జనవరి 21, 2020) ఉదయం పోలీసులు బాధితులను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడి కేసు నమోదు చేశారు. దీనిపై ఎస్సై చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చిన వెంటనే విచారణ చేపట్టి బాలుడిని కొట్టిన టీచర్‌తో పాటు ప్రిన్సిపల్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు.