విషాదం : ఈత నేర్చుకోవడానికెళ్లి బాలుడి మృతి

  • Published By: veegamteam ,Published On : February 23, 2019 / 06:21 AM IST
విషాదం : ఈత నేర్చుకోవడానికెళ్లి బాలుడి మృతి

హైదరాబాద్‌ : నగరంలోని రాజేంద్రనగర్‌ లో విషాదం నెలకొంది. స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకోవడానికి వెళ్లిన బాలుడు మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మహ్మద్ షేక్ ఖాజా పాషా (16) అనే బాలుడు కొంతకాలంగా రాజేంద్రనగర్‌లోని శివరాంపల్లి వద్ద ఉన్న A-Z స్విమ్మింగ్ పూల్ లో ఈత నేర్చుకోవడానికి వెళ్తున్నాడు. రోజూలాగే ఫిబ్రవరి 22 శుక్రవారం కూడా స్విమ్మింగ్ పూల్ కు వెళ్లాడు. ఈతనేర్చుకునే క్రమంలో బాలుడు ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందాడు. స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కోచ్‌ నిర్లక్ష్యం, స్విమ్మింగ్ పూల్ లో సరైన నిర్వహణ లేకపోవడంతోనే చనిపోయాడంటూ వారు ఆరోపిస్తున్నారు. 

యాజమాన్యంపై రాజేంద్రనగర్ పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పొస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. స్విమ్మింగ్‌ పూల్‌ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.