Telangana : మంత్రి హత్య కుట్ర కేసు, నిందితుల కస్టడీ పిటిషన్‌‌పై విచారణ

తనపై అక్రమ కేసులు నమోదు చేయించడంతో పాటు తన బార్‌ను మూసివేయించాడని తెలిపాడు. తన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాన్ని కూడా మంత్రి రద్దు చేయించాడని.. అందుకే మంత్రి హత్యకు కుట్ర పన్ని...

Telangana : మంత్రి హత్య కుట్ర కేసు, నిందితుల కస్టడీ పిటిషన్‌‌పై విచారణ

Srinivas Goud

Minister Srinivas Goud Case : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్య కుట్ర కేసులో కస్టడీ పిటిషన్‌పై విచారణ జరగనుంది. నిందితులను విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్న సైబరాబాద్ పోలీసులు.. వారిని కస్టడీకి ఇవ్వాలని మేడ్చల్ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరపనుంది కోర్టు. మరోవైపు మంత్రిపై హత్య కుట్ర కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నిందితుడు రాఘవేంద్రరాజు పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తన వ్యాపారాలు దెబ్బతీసి, ఆర్థికంగా తనకు నష్టం చేకూర్చాడమే కాకుండా తనను ఇబ్బందులకు గురి చేశాడన్నారు.

Read More : TRS Minister : అందుకే శ్రీనివాస్ గౌడ్‌‌ని చంపాలనుకున్నా.. హత్యా ప్రయత్నం కేసులో సంచలనాలు

తనపై అక్రమ కేసులు నమోదు చేయించడంతో పాటు తన బార్‌ను మూసివేయించాడని తెలిపాడు. తన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ కేంద్రాన్ని కూడా మంత్రి రద్దు చేయించాడని.. అందుకే మంత్రి హత్యకు కుట్ర పన్నినట్టు వెల్లడించాడు నిందితుడు రాఘవేంద్రరాజు. 2017 నుంచి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తనను చంపేందుకు ప్రయత్నించారని.. పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. వేధింపులు తట్టుకోలేక శ్రీనివాస్‌గౌడ్‌ను చంపాలనుకున్నానని చెప్పారు. తనపై మహబూబ్‌నగర్‌లో 10 క్రిమినల్‌, 13 ఎక్సైజ్‌ కేసులు పెట్టించారని.. తన సోదరులైన అమరేందర్‌ రాజుపై 3, నాగరాజుపై 2, ప్రేమ్‌ చందర్‌రాజుపై 3 కేసులు పెట్టారని రాఘవేంద్రరాజు పోలీసులకు తెలిపినట్లు స్టేట్‌మెంట్‌లో రికార్డ్ చేశారు. తనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేయించారని పోలీసులకు చెప్పాడు రాఘవేంద్రరాజు.