Extra Marital Affair : వివాహేతర సంబంధం-మీసేవా కేంద్రం శంకర్ హత్య-ఇద్దరు అరెస్ట్

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా రామగుండం మీసేవ కేంద్రం ఉద్యోగి కాంపెల్లి శంకర్ దారుణ హత్యకు  వివాహేతర సంబంధమే కారణమని రామగుండం పోలీసు కమీషనర్ చంద్రశేఖర్ రెడ్

10TV Telugu News

Extra Marital Affair :  రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెద్దపల్లి జిల్లా రామగుండం మీసేవ కేంద్రం ఉద్యోగి కాంపెల్లి శంకర్ దారుణ హత్యకు  వివాహేతర సంబంధమే కారణమని రామగుండం పోలీసు కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. ఈ కేసులో ప్రధాన ముద్దాయులైన ఎన్టీపీసీకి చెందిన పాయిల రాజు, హతుని భార్య హేమలత ను అరెస్టు చేసినట్టు చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నిందితుడి నుంచి రెండు కత్తులు, పగిలిన బీరు సీసా, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈరోజు జరిగిన విలేకరల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…. ఈ నెల 25న అదృశ్యమైన కాంపల్లి శంకర్ అదేరోజు దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి సంబంధించి హతుని భార్యతో రాజు అనే యువకుని మధ్య ఉన్న వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసిందని తెలిపారు. ఈ క్రమంలోనే శంకర్- రాజుల మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈనెల 25వ తేదీ కాంపల్లి శంకర్‌ను రాజు ఎన్టీపీసీలో ఉన్న ఇంటికి పిలిపించుకున్నాడు.
Also Read : Ramagundam : సినిమా చూసి మర్డర్..రామగుండం మీ సేవ ఉద్యోగి హత్య
భార్యను ఆస్పత్రిలో దింపిన శంకర్ రాజు ఇంటికి వచ్చాడు. అప్పటికే ఇద్దరూ మద్యం మత్తులో ఉన్నారు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడంతో బీరు సీసాతో రాజు శంకర్ తలపై కొట్టి చంపాడు. శంకర్ శరీరాన్ని ఏడు ముక్కలు చేశాడు. అనంతరం వివిధ ప్రాంతాలలో శరీర భాగాలను పడవేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ అనంతరం శంకర్ శరీర అవయవాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజుతో పాటు హతుని భార్య హేమలతను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఎన్టీపీసీ ధన్వంతరి హాస్పిటల్‌లో స్టాఫ్ నర్సు‌గా పనిచేసే శంకర్ భార్యతో అదే ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసే రాజుకు గతంలో సన్నిహిత్యం ఉండేది. ఈ క్రమంలోనే శంకర్-రాజులకు విరోధం ఏర్పడింది. దీంతో శంకర్‌ను దారుణంగా హతమార్చి డిటెక్టివ్ సినిమా మాదిరిగా శరీర అవయవాలను వివిధ ప్రాంతాల్లో వేశాడు. చివరకు రాజు, మృతుని భార్య హేమలత‌ను పోలీసులు కటకటాల్లోకి పంపించారు.
Also Read : Murder : దారుణం-ముక్కలు ముక్కలుగా నరికి హత్య

×