Woman Fraud : మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయమై, పెళ్లి పేరుతో రూ.17.89 లక్షలు దోచేసిన యువతి

హైదరాబాద్‌ లో కిలాడీ ఘరానా మోసానికి పాల్పడింది. మ్యాట్రిమోని సైట్‌లో పరిచయమైన యువతి.. పెళ్లి పేరుతో రూ.17.89 లక్షలు దోచేసింది. ఓ యువకుడు.. వధువు కోసం సైట్‌లో బయోడేటా పోస్టు చేశాడు.

Woman Fraud : మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో పరిచయమై, పెళ్లి పేరుతో రూ.17.89 లక్షలు దోచేసిన యువతి

Woman Fraud

Young Woman Fraud : హైదరాబాద్‌ లో కిలాడీ ఘరానా మోసానికి పాల్పడింది. ఓ మ్యాట్రిమోని సైట్‌లో పరిచయమైన యువతి.. పెళ్లి పేరుతో రూ.17.89 లక్షలు దోచేసింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం…బోయినపల్లికి చెందిన కుమార్‌.. వధువు కోసం ఓ మ్యాట్రిమోని వెబ్‌సైట్‌లో తన బయోడేటా పోస్టు చేశాడు. ఓ మహిళ ఫోన్‌ చేసి ప్రముఖ వైద్యురాలినని పరిచయం చేసుకొని, తనకు నచ్చారని చెప్పింది.

తాను త్వరలోనే హైదరాబాద్‌కు వస్తున్నానని.. రాగానే పెళ్లి చేసుకుందామని తెలిపింది. తర్వాత అతను అంగీకరిస్తే యూకే వెళ్తానని, లేదంటే హైదరాబాద్‌లోనే ప్రాక్టీస్‌ పెట్టుకుంటానని యువతి తెలిపింది. ఇద్దరూ వాట్సాప్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. కొంతకాలం తరువాత ఇండియాకు వస్తున్నానని, అతనికి విలువైన బహుమతి తెస్తానని చెప్పింది.

Gold Sweets : బంగారు మిఠాయిలు…కేజీ ధర ఎంతో తెలుసా?

రెండు రోజుల తరువాతే ఢిల్లీ విమానాశ్రయం నుంచి కస్టమ్స్‌ అధికారుల పేరుతో వ్యక్తి ఫోన్‌ చేసి ఓ అమ్మాయి వచ్చింది. ‘మీ పేరుతో యూకే కరెన్సీలో కోటి రూపాయలు వెంటతెచ్చింది. కస్టమ్స్‌, ఇన్‌కంటాక్స్‌ కట్టాలి’ అని రూ.17.89 లక్షలు వసూలు చేశారు.

తర్వాత అమ్మాయి, అధికారుల ఫోన్‌లు పని చేయకపోవడంతో బాధితుడు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ పేర్కొన్నారు.