రైతును శక్తిగా మార్చటమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి హరీశ్ రావు

  • Published By: nagamani ,Published On : June 26, 2020 / 07:21 AM IST
రైతును శక్తిగా మార్చటమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి హరీశ్ రావు

తెలంగాణ రాష్ట్రంలో హరిత హారం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. దీంట్లో భాగంగా సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో హరితహారంలో మంత్రి హరీశ్ పాల్గొని ముర్షద్ అలీ దర్గా ఆవరణలో మొక్కలనునాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ హరితహారం పేరుతో ప్రారంభించిన హరితహారం కార్యక్రమం ప్రతీ సంవత్సరం ఎంతో ఉత్సాహంగా కొనసాగుతోందని అన్నారు. 

ప్రతీ ఒక్కరూ మొక్కలునాటి పచ్చదనాన్ని పెంచాలనీ..హరిత హారంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయనీ..సాగునీటికి ఏమాత్రం కొదువ లేకుండా వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారని అన్నారు. వచ్చే యాసంగికి రైతు వేదికలను పూర్తి చేయాలని మంత్రి తెలిపారు.

పంటలు పండించే రైతన్నను శక్తిగా మార్చాలనే లక్ష్యంతో తెలంగాణా ప్రభుత్వం ముందుకెళుతోందనీ..మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రైతులు పంటలను సాగుచేస్తు..చక్కటి ఆదాయాన్ని పొందుతున్నారనీ..ఇదంతా సీఎం కేసీఆర్ కృషి వల్లనేనని అన్నారు. రైతలు కోసం అహర్నిశలు పాటు పడుతున్న సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి ఎన్నో పథకాలు తెచ్చారనీ దాంట్లో భాగంగానే రైతుబంధు పథకంలో వేస్తున్న డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయని వాటితో రైతులు పంటలు వేసుకోవచ్చని తెలిపారు.

Read: రైతు బంధు వద్దు..మీరే తీసుకోండి రైతు ఉదారత