Jubilee Hills : మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం..అనంతరం బ్లాక్ మెయిల్

మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనిపై లైంగికదాడి జరిపి...బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది.

Jubilee Hills : మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం..అనంతరం బ్లాక్ మెయిల్

Jubilee Hills

Aunty Having Extra Marital Affair : అక్రమ సంబంధాలు కుటుంబాల్లో చిచ్చు పెడుతున్నాయి. చిన్న చిన్న గొడవలతో పచ్చని సంసారాలు కకావికలమవుతున్నాయి. ఈ విషయం బయటకు తెలియనీయకుండా…దారుణాలకు తెగబడుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో ఎన్నో కుటుంబాలకు వేదన మిగిలిస్తున్నారు. వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చును పెడుతున్నాయి. అక్రమ సంబంధాల చిచ్చు కాపురాల్లో కలహాలను రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా..హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనిపై లైంగికదాడి జరిపి…బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడింది. లక్షల్లో డబ్బు కాజేసింది. ఈ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది.

జూబ్లీహిల్ పీఎస్ పరిధిలో 14 ఏళ్ల మేనల్లుడితో అత్త వివాహేతర సంబంధం పెట్టుకుంది. బాలుడిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడింది. వీటిని బాలుడికి తెలియకుండా రహస్యంగా రికార్డు చేసింది. ఈ వీడియోలు చూపెట్టి బాలుడిని బెదిరించింది. అంతేగాకుండా…డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో ఈ వీడియోలు ఎక్కడ బయటపడుతాయోనని ఆ బాలుడు బెదిరిపోయాడు. కుటుంబానికి తెలియకుండా ఆమె అడిగినంత ఇవ్వసాగాడు. మొత్తంగా 20 తులాల బంగారం, ఆరు లక్షల నగదు మేనత్తకు ఇచ్చాడు. కానీ…అదే పనిగా బెదిరింపులు చేయడంతో బాలుడు నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు మేనత్తను విచారించారు. ఆమెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.