Balapur : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర

వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు.

Balapur : బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం చరిత్ర

Balapur Laddu

Balapur Ganesh Laddu : విఘ్నాలు తొలగించే వినాయకుడి ప్రసాదం అంటే భక్తులందరికీ పరమ పవిత్రం. ఆ లడ్డూ తింటే విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలు లభిస్తాయని నమ్మకం. అందుకే గణనాథుడి ప్రసాదం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు. లడ్డూ వేలాన్ని ప్రతిష్టాత్మకంగా భావించి ఎంత ధరైనా వెచ్చించేందుకు సిద్ధపడతారు. ముఖ్యంగా బాలాపూర్ లడ్డూ చాలా ఫేమస్. ఈ లడ్డూను దక్కించుకుంటే తమకు తిరుగుండదని భక్తులవిశ్వాసం. అందుకే ప్రతియేటా దీని ధర దూసుకుపోతోంది.

Read More : Khairatabad Ganesh : నిమజ్జనానికి తయారైన ఖైరతాబాద్ గణేష్

కొత్త కొత్త రికార్డులు : 
కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈసారి ఆ లడ్డూ ధర ఎంత పలుకుతుందన్నది ఉత్కంఠ రేపుతోంది. భాగ్యనగరంలో అన్ని లడ్డూల కంటే బాలాపూర్ లడ్డూకు ఉన్న క్రేజే వేరు. ఈ గణేషుడి లడ్డూ బరువు 21కిలోలు మాత్రమే. ఈ ప్రసాదం క్వాంటిటీ తక్కువే కాంపిటేషన్ మాత్రం చాలా ఎక్కువ. ఈ మహాప్రసాదం కోసం ప్రముఖులు సైతం పోటీపడతారు. ఈ లడ్డూను దక్కించుకుంటే విఘ్న నాయకుడి కటాక్షం దక్కుతుందన్నది భక్తుల సెంటిమెంట్. అందుకే… తొలిసారి వందల్లో పలికిన లడ్డూ ధర… ఆ తర్వాత ఊహించని రీతిలో పెరిగిపోయింది.

Read More : Ganesh Nimajjanam 2021: గంగమ్మ ఒడికి బయల్దేరిన ఖైరతాబాద్ పంచముఖ గణేశుడు

1980 నుంచి ప్రారంభం : 
ప్రతియేటా కొత్త రికార్డులు సృష్టించింది. బాలాపూర్‌లో వినాయకుడికి లడ్డూను నైవేద్యంగా పెట్టే సాంప్రదాయం 1980 నుంచి ప్రారంభమైంది. కానీ… వేలం మాత్రం 1994లో స్టార్టయింది. ఆ సంవత్సరం తొలిసారి కొలను మోహన్ రెడ్డి.. 450 రూపాయలకు వేలంలో కొనుగోలు చేశాడు. 1995లోను ఆయనే రెండోసారి 4 వేల 500కు లడ్డూను దక్కించుకున్నాడు. ఇక కొలను కృష్ణారెడ్డి 1996లో 18వేలకు, 97లో 28 వేలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. 1998లో మరోసారి లడ్డూ కొలను మోహన్‌రెడ్డికి దక్కింది. ఆ సంవత్సరం వేలంలో 51వేల ధర పలికింది. 1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి 65వేలకు, 2000లో కల్లెం అంజిరెడ్డి 66వేలకు, 2001లో రఘునందన్ చారి 85వేలకు లడ్డూను దక్కించున్నారు.

Read More : Dasara Festival 2021 : అక్టోబర్ 7నుంచి ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవములు

తొలిసారి లక్ష రూపాయలు : 
2002లో బాలాపూర్ వినాయకుడి లడ్డూ ధర తొలిసారి లక్ష రూపాయలు దాటింది. ఆ ఏడాది లక్షా 5వేలకు లడ్డూను దక్కించుకున్నారు కందాడ మాధవ రెడ్డి. 2003లో చిగిరింత బాల్ రెడ్డి లక్షా 55వేలకు, 2004లో కొలను మోహన్ రెడ్డి 2లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డూను గెల్చుకున్నారు. 2005లో ఇబ్రహీం శేఖర్ 2లక్షల 8వేలకు దక్కించుకోగా… 2006లో చిగిరింత తిరుపతి రెడ్డి లడ్డూ ధరను 3లక్షలకు పెంచేశారు. అప్పటివరకు వేలల్లో పెరిగిన లడ్డూ ధర 2007 నుంచి లక్షల్లో పెరిగింది. 2007లో రఘునందన్ చారి 4 లక్షల 15 వేలకు అంటే అంతకుముందు ఏడాదికంటే ఏకంగా లక్షా 15 వేలు అధికంగా పాడి లడ్డూను గెల్చుకున్నారు.

Read More : Troffic Restrictions : గణేష్ నిమజ్జనం..సెప్టెంబర్ 19న హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

2015లో 10 లక్షలు : 
2008లోనూ సేమ్‌ సీన్ రిపీటయింది. ఆ సంవత్సరం కొలను మోహన్ రెడ్డి 5లక్షల 7వేలకు మరోసారి లడ్డూను దక్కించుకున్నారు.2009లో 5లక్షల 15వేలకు బాలాపూర్ లంబోదరుడి ప్రసాదాన్ని సరిత దక్కించుకోగా…  2010లో కొడాలి శ్రీధర్ బాబు 5లక్షల 35వేలకు, 2011లో కొలన్ బ్రదర్స్ 5 లక్షల 45వేలకు సొంతం చేసుకున్నారు. ఇక 2012 నుంచి ఈ లడ్డూ రేట్‌ ఏకంగా 2లక్షలు జంప్ అయింది. ఆ సంవత్సరం పన్నాల గోవర్ధన్ రెడ్డి 7లక్షల 50వేలకు దక్కించుకోగా… 2013లో తీగల కృష్ణారెడ్డి మరో 2లక్షలు పెంచేసి 9లక్షల 26వేలకు సొంతం చేసుకున్నాడు. 2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి 9లక్షల 50వేలకు వేలం పాడగా.. 2015లో 10 లక్షల మార్కును దాటేసింది.

Read More : Minor Girl Kidnapped : సంగారెడ్డిలో బాలిక కిడ్నాప్-సురక్షితం

గత ఏడాది తప్పిన కళ : 
కొలను మదన్ మోహన్ రెడ్డి 10 లక్షల 32వేలకు లడ్డూను గెలుచుకున్నాడు. ఇక 2016లో టాప్‌ రేంజ్‌కి దూసుకెళ్లింది. ఏకంగా 4లక్షలు పెంచిన స్కైలాబ్ రెడ్డి.. 14లక్షల 65వేలకు లడ్డూను దక్కించుకున్నాడు.  2017లో నాగం తిరుపతిరెడ్డి 15లక్షల 60వేలకు, 2018లో శ్రీనివాస్ గుప్తా 16లక్షల 60వేలకు, 2019లో  కొలను రామిరెడ్డి 17లక్షల 67వేలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. ప్రతియేటా ఎంతో ఉత్సాహంగా జరిగే ఈ లడ్డూ వేలం పాట గతేడాది మాత్రం కళ తప్పింది. కరోనా ప్రభావంతో వేలం పాటను రద్దు చేశారు.

Read More : People Decreasing in Height : 6 అడుగులపైనే పొడుగు ఉండే ప్రజలు పొట్టివారైపోతున్నారు..సర్వేలో ఆసక్తికర విషయాలు

అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం : 
దీంతో అందరి దృష్టి 2021, సెప్టెంబర్ 19వ తేదీ ఆదివారం జరిగే లడ్డూ వేలంపైనే ఉంది. ఈసారి ఎంత ధర పలుకుతుందన్నది ఆసక్తి రేపుతోంది. బాలాపూర్ లడ్డూ ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణం ఈ లడ్డూని పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని భక్తుల నమ్మకం. లడ్డూ సొంతం చేసుకున్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని విశ్వాసం. అందుకే ప్రతియేటా పోటాపోటీగా బాలాపూర్ లడ్డూ లక్షల్లో పలుకుతూ దూసుకుపోతోంది. మరి.. ఈసారి లడ్డూ ధర ఏ రేంజ్‌కు చేరుతుందన్నది కాసేపట్లో తేలిపోనుంది.