Bandi Sanjay : కూలికి పోతున్న చెల్లెళ్లు, భూమి లేని అన్నలకు నేను బ్రాండ్ అంబాసిడర్

రేపటి హుజురాబాద్ మనదే.. ఆ తర్వాత తెలంగాణ మనదే. బీజేపీ ఏ రోజు మీటింగ్ పెడితే... అదే రోజు కాంగ్రెస్ మీటింగ్ పెడుతోంది.

Bandi Sanjay : కూలికి పోతున్న చెల్లెళ్లు, భూమి లేని అన్నలకు నేను బ్రాండ్ అంబాసిడర్

Bandi Sanjay Public Meeting

Bandi Sanjay : రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తొలి దశ ప్రజా సంగ్రామ పాదయాత్ర హుస్నాబాద్ పట్టణంలో ముగించారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఈ సభకు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. బీజేపి అధికారంలోకి వచ్చాక సీఎం ఎవరైనా… మొదటి సంతకం విద్య, వైద్యం పైనే ఉంటుందని బండి సంజయ్ చెప్పారు. హుస్నాబాద్ గడ్డ… కోరమీసాల వీరభద్రస్వామి వెలిసిన గడ్డ అని చెప్పిన బండి సంజయ్… ఇదే చివరి పోరాటమని అందుకే పాదయాత్ర చేస్తున్నామన్నారు. ఈ ఎన్నికల్లో TRS బాక్స్ లు బద్దలవుతాయన్నారు బండి సంజయ్.

వీళ్లకే నేను బ్రాండ్ అంబాసిడర్
ప్రభుత్వ సంక్షేమానికి తనను బ్రాండ్ అంబాసిడర్ అంటున్నారన్న మంత్రుల విమర్శలకు బదులిచ్చారు బండి సంజయ్. డిగ్రీ చేసిన శిరీష చెల్లె…. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని.. శిరీష లాంటి చెల్లెళ్ళకి తాను బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పారు. ఎంఏ చేసిన వనజాక్షి అనే చెల్లె చాయ్ షాప్ నడుపుకోవాల్సిన దుస్థితి వచ్చిందని… ఆమెకు తాను బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. గూడు, గుడిసె లేని ఇస్లావత్ రజి, భూక్యా రజితలకు బ్రాండ్ అంబాసిడర్ గా బండి సంజయ్ ఉంటాడన్నారు.

Etala Challenges : హుజూరాబాద్ లో టీఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా

‘ధరణి’ వల్ల భూమి సమస్య ఎదుర్కొంటున్న అంజనేయులు అనే రైతుకు తాను బ్రాండ్ అంబాసిడర్ ని అని చెప్పారు. ప్రాజెక్టులతో ఆర్ఆర్ ప్యాకేజీ అందని నిర్వాసితులకు బ్రాండ్ అంబాసిడర్ ను అని చెప్పారు. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇప్పటికీ ప్యాకేజ్ ఇవ్వలేదని విమర్శించారు.

“పాదయాత్రలో మొత్తం 348 కి.మీ. పూర్తి చేసుకున్నాం. ప్రజలు, రైతులు, నిరుద్యోగులు, భూ నిర్వాసితులు… ఇలా ఎందరో తమ బాధలను చెప్పుకున్నారు. ధనిక రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ‘వరి వేస్తే ఉరే’ అని రైతులను కేసీఆర్ భయపెడుతున్నారు. ఎక్కడికి వెళ్లినా… సమస్యలే స్వాగతం పలికాయి. భాగ్యలక్ష్మి అమ్మవారి దయ, కార్యకర్తల అండతో… ఎండలో ఎండి, వానలో తడిచి 36 రోజులు పాదయాత్ర చేశాం. స్కూళ్లలో వనరులు, సిబ్బంది లేని పరిస్థితి ఉంది. కేంద్రం ఇస్తున్న నిధుల వివరాలు చెప్తుంటే… ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ప్రజా సంగ్రామ యాత్రను ఆపే పరిస్థితే లేదు. హుజురాబాద్ లో ఈటలను గెలిపించాక మళ్లీ పాదయాత్ర చేస్తా” అన్నారు బండిసంజయ్.
“హిందూ ధర్మం కోసం బీజేపీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. మార్పు కోసమే బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది. భైంసా లో కూడా భారీ బహిరంగ సభ పెట్టే దమ్ము బీజేపీకి ఉంది. రేపటి హుజురాబాద్ మనదే.. ఆ తర్వాత తెలంగాణ మనదే. బీజేపీ ఏ రోజు మీటింగ్ పెడితే… అదే రోజు కాంగ్రెస్ మీటింగ్ పెడుతోంది. దీన్నిబట్టే టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఒకటే అనేది అర్థం అవుతోంది ” అన్నారు బండి సంజయ్.

Dalitha Bandhu new Guidelines: దళిత బంధు కావాలంటే.. ఇలా చేయాల్సిందే!