Covid Positive : సూర్యాపేట DMHO కుటుంబంలో ఆరుగురికి కరోనా

పది రోజుల క్రితం జర్మనీ నుంచి DMHO చిన్న కుమారుడు వచ్చాడు. కోటాచలం కుటుంబం మూడు రోజుల క్రితం తిరుపతికి కూడా వెళ్లొచ్చింది.

Covid Positive : సూర్యాపేట DMHO కుటుంబంలో ఆరుగురికి కరోనా

Suryapet

Suryapet DMHO Family : తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కలకలం రేపుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అధికమౌతున్నాయి. కొత్త వేరియంట్ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.  ఈ క్రమంలో…సూర్యాపేటలో నివాసం ఉంటున్న DMHO కోటాచలం వైరస్ బారిన పడ్డారు. మొత్తం ఆయన కుటుంబంలో ఆరుగురికి వైరస్ సోకడం సూర్యాపేటలో కలకలం రేపుతోంది.

Read More : Redmi Note 10S : 8GB RAMతో భారత్‌కు రెడ్‌మి నోట్ 10S స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే?

పది రోజుల క్రితం జర్మనీ నుంచి DMHO చిన్న కుమారుడు వచ్చాడు. కోటాచలం కుటుంబం మూడు రోజుల క్రితం తిరుపతికి కూడా వెళ్లొచ్చింది. అంతేగాకుండా..2021, డిసెంబర్ 01వ తేదీ బుధవారం వైద్య సిబ్బందికి కోటాచలం బహుమతులు అందచేశారు. దీంతో ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కోటాచలం కుటుంబం హోం క్వారంటైన్ లో ఉంటున్నారు. ఆయన ఎవరితో సన్నిహితంగా మెలిగారో అనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Read More : ATM Cash : న్యూ ఇయర్ నుంచే..పెరగనున్న ఏటీఎం చార్జీలు

ఇదిలా ఉంటే…గత 24 గంటల్లో తెలంగాణ రాష్ట్రంలో 189 కరోనా కేసులు వెలుగు చూశాయి. 137 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో వైరస్ బారిన పడి ఇద్దరు చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 77 మందికి వైరస్ సోకింది. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, కొమరం భీం ఆసిఫాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఒక్క కేసు నమోదు కాలేదు.

Read More : Kadapa Flood : నేనున్నా..ధైర్యంగా ఉండండి, కాలినడకన సీఎం జగన్ పర్యటన

కొత్త వేరియంట్ పై ప్రజలు జాగ్రత్త పడాలని రాష్ట్ర ప్ర‌జారోగ్య సంచాల‌కులు డాక్ట‌ర్ శ్రీనివాస్ రావు సూచనలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని…ఐదు రెట్లు అధికంగా ప్రభావం చూపుతుందని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ మహిళకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని, గచ్చిబౌలిలోని టిమ్స్ కు తరలించి..పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. నమూనాలు సేకరించి..జన్యుపరీక్షల కోసం పంపినట్లు, ఒమిక్రాన్ వేరియంటా ? కాదా ? అనేది తెలియాలంటే..రెండు..మూడు సమయం పడుతుందన్నారు.