Bhargavi : భార్గవి ఎక్కడ..? మిస్టరీగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

హైదరాబాద్ దోమలగూడలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్గవి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈ నెల 10న బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తానని చెప్పి భార్గవి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా..

Bhargavi : భార్గవి ఎక్కడ..? మిస్టరీగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. సీసీ కెమెరాలో షాకింగ్ విజువల్స్

Bhargavi

Bhargavi : హైదరాబాద్ దోమలగూడలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భార్గవి మిస్సింగ్ కలకలం రేపుతోంది. ఈ నెల 10న బ్యూటీ పార్లర్ కి వెళ్లి వస్తానని చెప్పి భార్గవి బయటకు వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. సాయంత్రం నుంచి భార్గవి ఆచూకీ కోసం కుటుంబసభ్యులు వెతికారు. అయినా ఫలితం లేకపోయింది. దీంతో భార్గవి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న చిక్కడపల్లి పోలీసులు దర్యాఫ్తును ముమ్మరం చేశారు. సీసీ కెమెరాలను జల్లెడ పడుతున్నారు. నగరంలోని కాచిగూడ, పంజాగుట్ట, మలక్ పేట్ ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజీ ద్వారా పోలీసులు గుర్తించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో భార్గవి రూ.6వేలు తనతో తీసుకెళ్లినట్లు ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. కాచిగూడ రైల్వే స్టేషన్ కి వెళ్లిన భార్గవి అక్కడ రైలు ఎక్కలేదు. తిరిగి పంజాగుట్ట వరకు వచ్చినట్లు సీసీ కెమెరాల ఆధారంగా తెలుస్తోంది.

YouTube: యూట్యూబ్‌లో ఫ్యాన్ వార్‌కి చెక్.. ఇక ఆ కౌంట్ కనిపించదు

మళ్లీ పంజాగుట్ట సెంట్రల్ దగ్గర బస్సు ఎక్కడానికి భార్గవి ప్రయత్నించినట్టు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అక్కడి నుంచి మళ్లీ ఆటోలో మలక్ పేట్ వరకు వెళ్లిందని, మూసారాంబాగ్ మెట్రో స్టేషన్ వద్ద తన ఫోన్ పడేసినట్లు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. భార్గవి మిస్సింగ్ కేసు దర్యాఫ్తు మొత్తం సీసీ కెమెరాల ఆధారంగా చేస్తున్నారు పోలీసులు.

ఏడాది క్రితమే భార్గవికి వివాహమైంది. ఆమె దాంపత్య జీవితంలో ఎలాంటి ఇబ్బందులు లేవంటున్నారు భార్గవి తల్లిదండ్రులు. తమ బిడ్డ ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భార్గవి ఎక్కడుంది? ఏమైంది? అనేది తెలియక కంగారు పడుతున్నారు. పోలీసులు త్వరగా భార్గవి ఆచూకీ తెలుసుకుని ఆమెను ఇంటికి క్షేమంగా చేర్చాలని కోరుతున్నారు.

Snake : పాము కాటుకు గురైన వెంటనే ఏం చేయాలో తెలుసా?